హైదరాబాదులో న్యూ ఇయర్ వేడుకల మార్గదర్శకాలు !
- నూతన సంవత్సరాది నేపథ్యంలో మార్గదర్శకాలు
- వేడుకలకు రెండ్రోజుల ముందే అనుమతి
- రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే పర్మిషన్
- మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా
మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరాది వస్తోంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాదులో పాటించాల్సిన మార్గదర్శకాలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జారీ చేశారు.
- వేడుకలకు రెండ్రోజుల ముందే అనుమతి తప్పనిసరి.
- కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే నూతన సంవత్సర వేడుకల్లో అనుమతి.
- సిబ్బందికి రెండ్రోజుల ముందు కరోనా పరీక్షలు నిర్వహించాలి.
- కొత్త సంవత్సర వేడుకల్లో భౌతికదూరం పాటించాలి.
- మాస్క్ లేకుండా వేడుకల్లో పాల్గొంటే రూ.1000 జరిమానా.
- నూతన సంవత్సరాది సందర్భంగా నిర్వహించే బహిరంగ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు. ఎక్కడైనా ధ్వని కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే చర్యలు.
- నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ కు అనుమతిస్తే చర్యలు తప్పవు.
- నగరవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు. మద్యం మత్తులో వాహనం నడిపితే ఆర్నెల్ల జైలుతో పాటు రూ.10 వేల జరిమానా.
- అసభ్యకర రీతిలో దుస్తులు ధరించినా, అశ్లీల నృత్యాలు చేసినా చర్యలు.
కాగా, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు సర్కారు అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు, పబ్ లలో మద్యం సరఫరాకు అనుమతించింది.