సోనియా కోలుకోవాలని మహిళా కాంగ్రెస్ పూజలు
ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా నుంచి తిరిగి త్వరగా కోలుకోవాలని మహిళా కాంగ్రెస్ ఖమ్మం, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, దేవి ప్రసన్నల ఆధ్వర్యంలో ఆదివారం కల్లూరు మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దొబ్బల సౌజన్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, కలను నెరవేర్చిన సోనియమ్మ ఆయురారోగ్యాల తో ఉండాలని దేవాలయంలో పూజలు చేసినట్టు వివరించారు. ఈ దేశానికి సోనియాగాంధీ కుటుంబమే శ్రీరామరక్ష అని అన్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సున్నం నాగమణి, నాయకులు ధనలక్ష్మి, స్వరూప రాణి, రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు.