Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ –బాబు దోస్తీపై జోరుగా ప్రచారం…

మోడీ –బాబు దోస్తీపై జోరుగా ప్రచారం…
-మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ! జాతీయ పత్రికలో కథనం
-మోదీతో బాబు ఈ విషయమై మాట్లాడినట్టు జాతీయ పత్రికలో కథనం
-అమిత్ షాతో నారా లోకేశ్ కూడా భేటీ అయినట్టు పేర్కొన్న పత్రిక
-దసరా లేదా దీపావళి నాటికి పొత్తుపై ప్రకటన వచ్చే అవకాశం!

ప్రధాని నరేంద్రమోడీ —ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇటీవల కలయిక వరిదోస్తీపై జోరుగా చర్చజరుగుతోంది. ఇది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు . 2019 ఎన్నికలకు ముందు వరకు బీజేపీ తో ఉన్న టీడీపీ ఎన్నికలకు కొద్దినెలల ముందు ఎన్డీఏకి బై చెప్పి యూపీఏ కూటమిలో చేరింది. టీడీపీ ఊహించినట్లు ఆ ఎన్నికల్లో యూపీఏ చతికలపడి తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చి మోడీ రెండవసారి ప్రధాని అయ్యారు . నాటి నుంచి టీడీపీ కి ఢిల్లీలో బ్రేకులు పడ్డాయి . దాంతో తిరిగి తన ప్రాపకం కోసం బీజేపీ కి దగ్గర కావాలని ఎత్తులు వేస్తుంది . ఎట్టకేలకు ప్రధానిని గత 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు కలిశాడు . దీంతో ఆయన బీజేపీతో కలిసి నడవబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ చాన్నాళ్ల తర్వాత మళ్లీ బీజేపీతో జట్టు కట్టబోతోందని సమాచారం. కేంద్రంలోని ఎన్డీఏలో నారా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ చేరబోతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే దసరా లేదా దీపావళి నాటికి ఎన్డీఏలో టీడీపీ చేరిక ఉంటుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఇండియన్ఎక్స్ ప్రెస్’ ఢిల్లీ ఎడిషన్ రాసిన కథనం సంచలనంగా మారింది. పొత్తు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు మాట్లాడారని, అలాగే అమిత్ షాతో నారా లోకేశ్ సమావేశమై మంతనాలు సాగించారని పేర్కొంది.

‘ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో విభేదించి టీడీపీతో జతకట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ నిర్వహించిన శాంపిల్ సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం కేవలం 3 నుంచి 4 శాతంగా ఉందని తేలింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నందున టీడీపీ పొత్తు పెట్టుకుంటే తమ బలం పుంజుకుంటుందన్నది బీజేపీ వాదన. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి పెద్దగా ఫలితం ఉండకపోగా, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుతుందని పోల్ సర్వేలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలు వేరయి విచ్ఛిన్నమవుతున్న ఎన్డీయేలో టీడీపీ చేరడంపై పండుగ సీజన్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది’ అని ప్రముఖ జర్నలిస్ట్ కూమి కపూర్ ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు రాసిన కథనంలో పేర్కొన్నారు.

టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. తెలంగాణ విడిపోయిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేసింది. మరోవైపు ఏపీలో అధికార వైసీపీ.. కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది.

Related posts

జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ …రాహుల్ గాంధీ హాజరు…

Drukpadam

బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ రాజేశ్వర్‌రెడ్డి..

Drukpadam

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు…

Drukpadam

Leave a Comment