Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖరాజధాని అనుకూల వ్యతిరేక పార్టీల కొట్లాట …ఏపీ మంత్రులపై దాడి!

విశాఖరాజధాని అనుకూల వ్యతిరేక పార్టీల కొట్లాట …ఏపీ మంత్రులపై దాడి!
విశాఖ‌లో హైటెన్ష‌న్‌.. రోజా, జోగి ర‌మేశ్‌, వైవీ సుబ్బారెడ్డి కార్ల‌పై జ‌న‌సైనికుల దాడి…
-ఏపీ మంత్రుల‌పై దాడి ఘ‌ట‌న‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు
-కేసు న‌మోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు
-విశాఖ గ‌ర్జ‌న‌కు హాజ‌రైన సుబ్బారెడ్డి, రోజా, జోగి ర‌మేశ్
-తిరుగు ప్ర‌యాణంలో ఎయిర్‌పోర్టు చేరుకున్న నేత‌లు
-అదే స‌మ‌యంలో ప‌వ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన జ‌న‌సైనికులు
-వైసీపీ నేత‌ల కార్ల‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసిన జ‌న‌సేన శ్రేణులు
-వైసీపీ నేత‌ల కార్ల అద్దాలు ధ్వంసం
-ఎయిర్‌పోర్టులో సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించిన విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్‌
-సీసీటీవీ ఫుటేజీ ప‌రిశీల‌న‌తో నిందితుల గుర్తింపు

విశాఖ‌లో శ‌నివారం తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా అధికార వైసీపీ చేప‌ట్టిన విశాఖ గ‌ర్జ‌న‌కు హాజ‌రై తిరిగి వెళుతున్న స‌మ‌యంలో వైసీపీ కీల‌క నేత‌, టీటీడీ చైర్మ‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, జోగి ర‌మేశ్ కార్ల‌పై జ‌నసేన కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి.

ఏపీలో అధికార పార్టీ వైసీపీ శ‌నివారం విశాఖ‌లో నిర్వ‌హించిన విశాఖ గ‌ర్జ‌నలో పాల్గొని తిరిగి వెళుతున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి ర‌మేశ్‌ల‌తో పాటు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిలపై జ‌రిగిన దాడిపై పోలీసు కేసు న‌మోదు అయ్యింది. విశాఖ విమానాశ్ర‌యం ప‌రిధిలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై ఎయిర్‌పోర్టు పోలీసులే కేసు న‌మోదు చేశారు.

శ‌నివారం సాయంత్రం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన విశాఖ పోలీసు క‌మిష‌న‌ర్ హుటాహుటీన ఎయిర్ పోర్టు చేరుకున్నారు. దాడికి సంబంధించి రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని ఆయ‌న ప‌రిశీలించారు. ఈ ఫుటేజీలో నిందితుల‌ను గుర్తించిన పోలీసులు… నిందితుల‌పై హ‌త్యాయ‌త్నం కింద కేసులు న‌మోదు చేశారు.

విశాఖ గ‌ర్జ‌న‌కు హాజ‌రైన సుబ్బారెడ్డి, రోజా, జోగి ర‌మేశ్ కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని శ‌నివారం సాయంత్రం స‌మ‌యంలో విశాఖ నుంచి బ‌య‌లుదేరేందుకు ఎయిర్‌పోర్టుకు బ‌య‌లుదేరారు. అదే స‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు జ‌న సైనికులు భారీ సంఖ్య‌లో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ స‌మ‌యంలోనే వైసీపీ నేత‌ల కార్లు క‌నిపించ‌డంతో క‌ర్ర‌లు, రాళ్లు చేత‌బ‌ట్టిన జ‌న‌సైనికులు కార్ల‌పై దాడికి దిగారు. ఈ దాడితో విశాఖ‌లో ఒక్క‌సారిగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Related posts

లోక్ సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు!

Drukpadam

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న ఈటల మాటలు…

Drukpadam

అసలు సుఖేష్ ఎవరు …కేసీఆర్ పై కక్షతోనే ఈనాటకమంతా …ఎమ్మెల్సీ కవిత !

Drukpadam

Leave a Comment