తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

మాది ప్రజాబలం…లక్షమందితో కొత్తగూడెం సభ …ఖమ్మం మీడియా సమావేశంలో కూనంనేని …

మాది ప్రజాబలంలక్షమందితో కొత్తగూడెం సభఖమ్మం మీడియా సమావేశంలో కూనంనేని
ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు కమ్యూనిస్టులకే సాధ్యం
దేశానికి బీజేపీ ప్రమాదం సందేశాన్ని కోటి మందికి వినిపించాం
-3 వేల గ్రామాలకు నేరుగా వెళ్లి సమావేశాలు ,సభలు పెట్టాం
ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని ఓడించడంలో విజయం సాధించాం ..
రాముడి జన్మస్థలం అయోధ్యలో 6 వార్డ్ లలో సిపిఐ గెలిచింది
రాముడు గుడి ఉన్న ప్రాంతంలో కూడా సిపిఐ అభ్యర్థి విజయం

మాది ప్రజాబలంఅందుకే ప్రజాసమస్యలు ఎజండాగా కొత్తగూడెం లో ఈనెల 11 లక్షమంది తో భారీ ప్రజా గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేశామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు . శుక్రవారం ఖమ్మం సిపిఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సభకు ప్రజల సమీకరణ వస్తున్న స్పందన గురించి వివరించారుదీనిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశాం ..ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుందిఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చేందుకు సిద్దపడుతున్నారు. రెడ్ షర్ట్ వాలంటీర్లు , ఎర్ర చీరలు ధరించిన మహిళలు కళాకారుల బృందాలు , సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సాంబశివరావు పేర్కొన్నారు .

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని సాంబశివరావు అన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఆగడాలకు కళ్లెం పడే రోజులు ఎంతో దూరంలో లేవని స్పష్టమైందని విశ్వాసం వ్యక్తం చేశారు . దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాసమస్యలు ఏమి లేనట్లు కేవలం మతం ,ప్రాంతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుందని బీజేపీ విధానాలను దుయ్యబట్టారు . బీజేపీ వైఖరి ప్రజలకు అర్థం అయిందని ఇందులో కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్ర విస్మరించరాదని అన్నారు. దేశంలో ఉన్న అనేక పబ్లిక్ రంగ సంస్థలను కారుచౌకగా ప్రభుత్వం తన అనుయాయులకు తెగ నమ్ముతుండగా , మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను తీసుకోని వస్తుందని , ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా వాటిని రెగ్యూలరైజ్ చేయడంలేదని ధ్వజమెత్తారు . ఇదేనా ప్రజా రంజక పాలనా అంటూ దెప్పి పొడిచారు .

కేంద్రంలోగాని , రాష్ట్రంలోగాని పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్య బద్దం కాదని, ప్రజల ఓపికను పరీక్షంచవద్దని హెచ్చరించారు . రాజకీయాల్లో అవినీతి ,అక్రమాలు , మతోన్మాదం , విచ్చిన్న రాజకీయాలు పెంచి పోషిస్తున్న బీజేపీ పాలనకు బుద్ది చెప్పాలని సాంబశివరావు పిలుపు నిచ్చారు . అందుకే తాము దేశంలో అవినినీతి రహిత పాలనా కోసం డబ్బులేని రాజకీయాల కోసం దామాషా పద్ధతిన ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు . తమ డిమాండ్ న్యాయబద్ధమైనది . తాత్కాలికంగా అది నెరవేరక పోవచ్చు కానీ అంతిమ విజయం మాత్రం నీతి,న్యాయనిదేనని అన్నారు .

రామజన్మ భూమి అయోధ్య మున్సిపాలిటీలో సిపిఐ 6 వార్డ్ లు గెలిచిందని అందులో గుడి ఉన్న వార్డ్ కూడా ఉందని సాంబశివరావు తెలిపారు . రాముడు పేరుతొ రాజకీయాలకు ఇక కాలం చెల్లిందని అన్నారు .

రాష్ట్రంలో సమస్యలు గురించి కమ్యూనిస్టులు స్పందించడంలేదనే వారికీ సమాధానంగా పోడు భూముల విషయంలో , ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదని తప్పు పట్టారు . మొదట 14 లక్షల ఎకరాలు పోడు భూమి సాగులో ఉందని చెప్పిన ప్రభుత్వం ,తర్వాత 11 .50 లక్షల ఎకరాల అని చెప్పి ఇప్పుడు దాని సంఖ్య 4 లక్షలు అంటుందని ప్రభుత్వ విధానంపై అసహానం వ్యక్తం చేశారు . ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం విఫలమైందని అన్నారు . ఇప్పడు ప్రభుత్వం సొంత స్థలం ఉంటె మూడు లక్షలు ఇస్తానని అంటుందని అవి మూలకు సరిపోవని కనీసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు . అందరికి గూడు , వైద్యం, విద్య , వృద్దులకు గ్యారంటీ పెన్షన్ పథకం అమలు చేయాలనీ సాంబశివరావు డిమాండ్ చేశారు . మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు , సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ , సహాయ కార్యదర్శి దండి సురేష్ , సిపిఐ జిల్లా నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి జానీమియా , కరుణాకర్ లు పాల్గొన్నారు .

Related posts

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడిగా తాతా మధు… ఎవరి ఛాయస్ …

Drukpadam

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం… సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

తుమ్మలకు ఎమ్మెల్సీ అంటూ వస్తున్న వార్తలు ..ఏది నిజం …ఏది అబద్దం!

Drukpadam