తెలంగాణ రాజకీయ వార్తలు ..

తుమ్మల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా …?

తుమ్మల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా …?
వచ్చేనెల సెప్టెంబర్ 6 లేదా ..? 9 న ఢిల్లీ లో ఖర్గే /రాహుల్ సమక్షంలో చేరతారని ప్రచారం
ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదంటున్న తుమ్మల అనుయాయిలు
స్వగ్రామం గండుగులపల్లిలో తుమ్మల మకాం …
ఆయన్ను కలిసేందుకు క్యూకడుతున్న ఉమ్మడి జిల్లాలోని ఆయన అభిమానులు
అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్న తుమ్మల
పాలేరు నుంచి కచ్చితంగా పోటీచేస్తానని నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలకు హామీ

బీఆర్ యస్ కు దూరమైన మాజీమంత్రి తుమ్మల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా …? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు … సెప్టెంబర్ 6 లేదా 9 వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేదా రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది….ఆయన అనుయాయులు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని అంటున్నారు . హైద్రాబాద్ నుంచి గత నాలుగు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన తుమ్మలకు జిల్లా ప్రజలు నాయకునిగూడెం టోల్ ప్లాజా వద్ద ఘనస్వాగతం పలికిన విషయం విదితమే …ఆయన పర్యటన సందర్భంగా ఎక్కడ బీఆర్ యస్ జెండాలు కనిపించలేదు ..దీంతో ఆయన నాటినుంచే బీఆర్ యస్ తో తెగదెంపులు చేసుకున్నారు ..

ఆయన్ను అవమానపరిచి టికెట్ ఇవ్వకుండా గెంటివేసిన బీఆర్ యస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కక్ష్య తో ఉన్నారు తుమ్మల అనుచరులు …పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నది ఆయన కొద్దీ కాలమేఅయినప్పటికీ అక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు …అభివృద్ధిని పరుగులు పెట్టించారు ..కరువు ప్రాంతంగా ఉండి వెనకబడిన తిరుమలాయపాలెం , కూసుమంచి , ఖమ్మం రూరల్ కొన్ని ప్రాంతాలకు భక్తరామదాసు ప్రాజక్టు ద్వారా నీరు అందించిన అపర భగీరధుడుగా పేరు తెచ్చుకున్నారు . ఓడిపోయినప్పటికీ పాలేరులో పర్యటనలు చేస్తూ తనను నమ్ముకున్న వారికీ అండగా ఉంటూ వచ్చారు .

నాలుగురోజుల క్రితం జిల్లాకు వచ్చిన దగ్గర నుంచి తన స్వగ్రామం దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో ఉంటున్నారు . దీంతో ఆయన అభిమానులు ,హితులు , సన్నిహితులు అక్కడికి క్యూకడుతున్నారు . ఏపీ నుంచి కూడా తన స్నేహితులు వచ్చి కలుస్తున్నారు . అందరికి చిరునవ్వుతో పలకరిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు . పాలేరు , ఖమ్మం నుంచి అధికసంఖ్యలో తుమ్మలను కలుస్తున్నారని ఇంటలిజెన్స్ నివేదికలు కూడా ఉన్నాయి. ఆయన నిజంగా కాంగ్రెసులోకి వెళుతున్నారా ..? లేక బీజేపీకి వెళ్లే అవకాశం ఉందా ? అని వేగులు ఆరాతీసున్నారు …ఆయన్ను కలవకుండా ,ఆయనకు స్వాగతం పలకకుండా అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆయన ప్రజలు తండోపతండాలుగా రావడం కొంత అధికార పార్టీ నేతలను కంగారు పెట్టిస్తుంది…

తనను కలవడానికి వచ్చిన పాలేరు నేతలకు తప్పకుండ పాలేరులో పోటీచేస్తా గెలుపు మనదే అంటున్నారు .అయితే ఖమ్మం నుంచి పోటీచేయాలని కూడా కొందరు ఆయన దగ్గర ప్రస్తాహిస్తున్నారు. మరో ప్రచారం కూడా జరుగుతుంది తుమ్మలను కూకట్ పల్లి నుంచి పోటీచేయించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని అక్కడ తుమ్మ్మల సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని తాజాగా చేసిన సర్వేలో తుమ్మలపై సానుకూలంగా రిపోర్ట్ వచ్చిందని అంటున్నారు .అయితే తుమ్మల మాత్రం తాను పాలేరులోనే పోటీచేస్తానని ఒక వేళ పాలేరు ఇబ్బంది ఉంటె అవసరమైతే స్వంత్రంగా పోటీచేస్తానని అంటున్నట్లు తెలుస్తుంది….చూద్దాం ఏమి జరుగుతుందో…..!

Related posts

కల్వకుంట్ల కుటుంబాన్నిఅధికారంలోకి రానివ్వనని రేవంత్ రెడ్డి శపథం …

Ram Narayana

ఇవాళ ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా… సీఎం అయ్యాక రేవంత్ తొలి ప్రసంగం

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ….?తుమ్మలా…? పొంగులేటినా …??

Ram Narayana