Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ కు దమ్ముంటే పాలేరు లో పోటీచేయాలి …పొంగులేటి సవాల్

కేసీఆర్ కు దమ్ముంటే పాలేరు లో పోటీచేయాలి …పొంగులేటి సవాల్
కాంగ్రెస్ కు 80 నుంచి 82 సీట్లు ..కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం…
ప్రజాస్వామ్యాన్ని గురించి కేసీఆర్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది..
నీపక్కన కూర్చున్నవాళ్ళని డబ్బులతో కొనలేదా …ప్రమాణం చేస్తావా…?
దళితబంధు కేవలం మూఢునియోజకవర్గాలకే ఎందుకు పరిమితం చేయాలి ..అన్ని నియోజకవర్గాల్లో ఇవ్వాలి ..
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మీరు మాత్రం ధనవంతులు అయ్యారు
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంలో మీ అవినీతి బయట పడింది ..

కేసీఆర్ కు దమ్ముంటే పాలేరు లో తనపై పోటీచేసి గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో -చైర్మన్ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు ….శుక్రవారం పాలేరు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేసీఆర్ జీళ్ళచెర్వు వద్ద జరిగిన సభలో తుమ్మల పై అవాకులు చవాకులు పేలారని ,తన పేరు ప్రస్తావించకుండానే కాంట్రాక్టు డబ్బుల మదంతో వ్యహరిస్తున్నారని మాట్లాడటంపై మండిపడ్డారు …తుమ్మల కు ఏమి అన్యాయం చేశామని మాట్లాడారు …ఆయన దానికి బాగానే కౌంటర్ ఇచ్చారు ..కేసీఆర్ ఎలాంటి మనిషో చెప్పారు ..ఇంతకన్నా ఏమికావాలని అన్నారు . ఈరోజు కొందరు సీఎం వందిమాగధులు ప్రెస్ మీట్ పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు .కేసీఆర్ నిజస్వరూపం తెలియని వాళ్ళే మోసపోయేంతవరకు అలానే మాట్లాడతారని అన్నారు ..సీఎం కేసీఆర్ మాట్లాడినదాంట్లో తప్పేముంది 100 కు 100 కరెక్ట్ అంటున్నారు …వంత పడుతున్నారు..తుమ్మల అన్నదాంట్లో తప్పేముందో చెప్పాలని నిలదీశారు ..డబ్బు గురించి మాట్లాడుతున్నారు … ఎవరిదగ్గర ఎంత పాపపుసోమ్ము ఉందో తెల్సకునేందుకు , తడిబట్టలతో ప్రమాణం చేయడానికి రావాలని కేసీఆర్ కు సవాల్ చేశారు ..

హుజురాబాద్ లో ఈటెల ను ఓడించడానికి మీరు మొదలుపెట్టిన పధకమే దళితబంధు కదా …అక్కడ ప్రజలు కర్రుకాల్చి వాతలు పెట్టిన బుద్దిరాలేదా …? కిందపడ్డ పైచెయ్యి నాదే అనే మనస్తత్వం మీది …కాదంటారా…? దళితబంధు పేరుతో వారి ఓట్ల కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు ..నియోజకవర్గానికి 100 యూనిట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతాయి..
సత్తుపల్లి,పాలేరు,హుజురాబాద్ లోనే దళితులు ఉన్నారా….. ఇదేనా నీకు దళితులమీద ఉన్న చిత్తశుద్ధి …అని ప్రశ్నించారు ..మేము గ్యాస్ రూ 500 కు అంటే మీరు 400. రూపాయలు అన్నారు ..ఇదికాపీ కాదా….

30 రోజుల్లో 27 రోజులు రెస్ట్ కదా….మిగతా రోజుల్లో సొల్లు కబుర్లు,సామెతలకు, 3 రోజులు కేటాయిస్తున్నారు….ఇదే ప్రజల పట్ల మీకు ఉన్న కమిట్మెంట్ అని దెప్పిపొడిచారు.. ముఖ్యమంత్రిగా ప్రజా శ్రేయస్సు కోసం మీరు పనిచేయట్లేదు….నేను డబ్బు సంపాదించా….
వ్యవసాయం,కాంట్రాక్టర్లు చేసి ….అఫిడవిట్ లో చూపిస్తున్న నా ఆస్థులన్నీ….
మీరు దగ్గర ఉన్న ఆస్తులు వాస్తవాలు చూపించగలరా …? అని ప్రశ్నించారు .మీ అయ్య కోటీశ్వరుడా కాదుకదా?.మరెలా వచ్చాయి ఇన్ని కోట్లు నీకు….ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కోట్లు సంపాదించింది వాస్తవం కాదా…? దేశంలో నీలాంటి పనికిరాని ముఖ్యమంత్రి లేరంటే అతిశయోక్తి కాదు …మేడిగడ్డ మేడిపండు చందంగా ఉంది…కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం కార్డులా ఉందని జెపి నడ్డా,అమిత్ షా అంటూనే ఉన్నారు కాదా……

దేవుడే మేడిగడ్డ రూపం లో చూపించాడు…మీ పతనానికి చివరి మెట్టు మేడిగడ్డ….
సోనియమ్మ ఇచ్చి ఉండకపోతే తెలంగాణ సాధ్యం అయ్యేది కాదని అసెంబ్లీ లో అన్న మాటలు గుర్తులేదా?….నీ మాటా మీద నీకే నమ్మకం పోతే ఎలా….ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో రైతుబంధు నవంబర్ 2 న వేయమన్నారు దాన్ని కూడా వక్రీకరించారు…..నీకు భాష మీదా మంచి పట్టు ఉంది కదా దాన్ని దాన్ని కూడా వక్రమార్గాలు ఉపయోగిస్తున్నావు .. నీకు చిత్తశుద్ధి ఉంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నియమావళి కి కట్టిబడి ఖర్చు పెట్టి గెలవండి చూద్దాం అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు ..ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే డబ్బు డంప్ చేశావు …….
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక 10 ఏళ్ళు మా దగ్గర ఎక్కడుంది డబ్బు….భట్టి,నేను వస్తాం.మీరు రండి దేవుడిపై ప్రమాణం చేద్దాం నిబంధనలకు అనుగుణంగా 40 లక్షల వరకు ఖర్చు మాత్రమే చేస్తానని ప్రమాణం చేయండి ..

మీ పార్టీలోకి నేను వచ్చి పదవులు అనుభవకంచింది ఏమీ లేదు నాయనా….నీ కొడుకు,అల్లుడు,నీ తొత్తులు వందలసార్లు నా దగ్గరకు వస్తే నాతోపాటు నా ఎమ్మెల్యే లను తీసుకొని వచ్చా మీ మీద నమ్మకం తో చేరితే ఎలాంటి గౌరవం ఇచ్చావో తెలుసు ..
ఖమ్మంలో ఎమ్మెల్యేలు ఎందుకు ఒడిపోయామో కూడా విశ్లేషణ కూడా చేయలేని పార్టీ నీది….
గెలిస్తే నీది,ఓడితే ఆ తప్పు ఇంకొకరిది అంటావు …

ఇప్పటికీ చెప్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లకు కట్టుబడి ఉన్నా….కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్న రాసుకో…..ధరణి పోర్టల్,నిన్ను,నీ తొత్తుల్ని తరుముతాం….
ఇంటికే నిన్ను పరిమితం చేస్తామ్….పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి కాదు నువ్వు రా కలిసి పోటీ చేద్దాం….అపుడు తెలుసుద్ది ఎవడి దమ్ము ఏంటో….ఎవరు ఎన్ని డబ్బు సంచులతో వచ్చినా,కుతంత్రలతో వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే…..రాష్ట్రం లో 80 నుంచి 82 సీట్లు వస్తున్నాయి….ఇంకా పెరగొచ్చు…..వైరాలో కాంగ్రెస్ పార్టీనే పోటీచేయొచ్చు…..అని పొంగులేటి అన్నారు.మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు జావేద్ ,పీసీసీ ప్రతినిధి రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…

Related posts

కేటీఆర్ పై పొంగులేటి ఫైర్ ..పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక!

Ram Narayana

కేసీఆర్ తీరుపై తుమ్మల ఫైర్

Ram Narayana

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment