అంతర్జాతీయం

కారులో గ్యాస్ లీక్.. అమెరికాలో విజయవాడ యువతి మృతి

  • పైచదువుల కోసం అమెరికాకు వెళ్లిన విజయవాడ యువతి
  • బుధవారం షికాగోలో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం
  • కారులో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో స్పృహ కోల్పోయిన యువతి
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
Vijayawada woman dies in chicago after gas leak in car

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువతి అనూహ్య రీతిలో దుర్మరణం చెందింది. కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో కన్నుమూసింది. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) స్థానికంగా ఫిజయోథెరపీలో డిగ్రీ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లింది. బుధవారం షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో, డ్రైవర్‌తో పాటూ నాజ్ కూడా స్పృహ తప్పింది. జహీరా నాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Related posts

ఐదే ఐదు నిమిషాల్లో 10 వేల స్టూడెంట్ వీసా స్లాట్ల బుకింగ్.. ఆందోళనలో విద్యార్థులు…

Ram Narayana

సూట్ కేసులో పుతిన్ మలమూత్రాలు.. అధ్యక్షుడి పర్యటనలో కఠిన భద్రతాచర్యలు!

Ram Narayana

నేపాల్‌లో కొత్త శకం.. ప్రభంజనం సృష్టిస్తున్న ర్యాపర్ బాలెన్ షా పార్టీ

Ram Narayana