Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పబ్లిసిటీ కోసం పిటిషన్లు వేస్తారా.. రూ.20 లక్షలు జరిమానా కట్టండి:నటి జుహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్….

పబ్లిసిటీ కోసం పిటిషన్లు వేస్తారా.. రూ.20 లక్షలు జరిమానా కట్టండి:
-జుహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
-5జీ అమలును వ్యతిరేకిస్తూ నటి జుహీ చావ్లా వ్యాజ్యం
-కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
-ప్రచారం కోసమే పిటిషన్‌ వేశారని వ్యాఖ్య
-విచారణకు అడ్డుతగిలిన జుహీ అభిమానులు
-వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

అనవసరంగా పిటిషన్ లు వేసేవారికి ఢిల్లీ హైకోర్టు తగిన విధంగా షాక్ ఇచ్చింది…. ఉన్నదానికి లేని దానికి పిటిషన్లు వేసి కోర్ట్ సమయాన్ని హృద చేయవద్దని ఇటీవల భారత ఉన్నత న్యాయస్థానం కూడా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే …. ప్రముఖ బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా కూడా ఢిల్లీ హైకోర్టు లో దేశంలో 5జీ అమలును సవాల్‌ చేస్తూ పిటిషన్ వేశారు. ఆమె వేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేవలం ప్రచారం కోసం మాత్రమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని అభిప్రాయపడుతూ, కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా జుహీతో పాటు ఈ పిటిషన్‌ దాఖలు చేసిన వారందరూ కలిసి కోర్టు ఫీజు కింద రూ.20 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

అలాగే జుహీ చావ్లా ఇచ్చిన లింక్‌ ద్వారా ఆమె పిలుపు మేరకు కొంత మంది కోర్టు వర్చువల్‌ విచారణలో పాల్గొని రాద్ధాంతం చేశారు. ఆమె నటించిన చిత్రాల్లోని పాటలు పాడుతూ విచారణకు అడ్డు తగిలారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని కోర్టు ఆదేశించింది.

Related posts

జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే జెండా, ఎజెండా:విరహత్అలీ!

Drukpadam

.పెళ్లి పీటల మీదకు తాగివచ్చిన వరుడు … పెళ్లి రద్దు …

Drukpadam

Tech News | This Is Everything Google Knows About You

Drukpadam

Leave a Comment