Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు…

  • నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశం
  • కూల్చివేతలకు 15 రోజుల గడువు విధింపు
  • బీఆర్ఎస్ కు రూ. 1 లక్ష జరిమానా

బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు పెద్ద షాకిచ్చింది. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించింది. కూల్చివేతలకు 15 రోజుల గడువు కూడా విధించింది.  

పూర్తి వివరాల్లోకి వెళితే… నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో నిర్మించారని… ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో, బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 

తమ కార్యాలయాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును బీఆర్ఎస్ కోరింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఆఫీస్ ను నిర్మించక ముందే అనుమతులు తీసుకోవాలని… కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. 

15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అంతేకాదు… బీఆర్ఎస్ పార్టీకి రూ. 1 లక్ష జరిమానా విధించింది.

Related posts

హోటల్ ఎల్లా వద్ద రేవంత్ అనుచరుల రచ్చ.. పోలీస్ స్టేషన్ కు తరలింపు

Ram Narayana

స్టాప్‌లో బస్సు ఆపలేదని.. బీర్‌బాటిల్‌‌తో దాడిచేసి కండక్ట‌ర్‌పై పాము విసిరిన ప్రయాణికురాలు..

Ram Narayana

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై వాహనాల వేగం మళ్లీ పెంపు

Ram Narayana

Leave a Comment