ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఈ బడ్జెట్ తో మధ్య తరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు: విజయసాయిరెడ్ది

  • నిన్న కేంద్ర బడ్జెట్ ప్రకటన
  • రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
  • మిడిల్ క్లాస్ బడ్జెట్ గా ఇది గుర్తుండిపోతుందన్న విజయసాయి

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిన్న 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. దీనిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 

ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్ ‘మిడిల్ క్లాస్ బడ్జెట్’ గా గుర్తుండిపోతుందని తెలిపారు. పైగా ఇది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ అని వెల్లడించారు. ఈ బడ్జెట్ తో దేశంలో మధ్య తరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

ఆదాయ పన్ను ఊరట, కస్టమ్స్ సుంకాలు తగ్గించడం, దృఢమైన ఆర్థిక సంస్కరణలతో… కష్టించి పనిచేసే కుటుంబాలకు ఈ బడ్జెట్ సాధికారత కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి పథాన్ని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు.

Related posts

సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు

Ram Narayana

మంగళగిరిలో జగన్ రోడ్ షో..భారీగా తరలి వచ్చిన జనం …!

Ram Narayana

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని

Ram Narayana