తెలంగాణ రాజకీయ వార్తలు ..

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లీగల్ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన తరపు న్యాయవాది విజయ్‌కాంత్‌ ద్వారా ఈ నోటీసులు పంపించారు.

తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు మల్లు భట్టివిక్రమార్క మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రూ. 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. క్షమాపణ చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు.

భట్టి విక్రమార్క ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైద్రాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ లో రెండు సంవత్సరాల క్రితం వేముల రోహిత్ చనిపోయారు …రోహిత్ మరణానికి బీజేపీకి చెందిన వారు కారణమని వారు రెచ్చెగొట్టేలా ప్రవర్తించారని అందువల్లనే యూనివర్సిటీలో గొడవలు జరిగాయని భట్టి అన్నారు …అందుకు నూతన బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రామచందర్ రావు కూడా భాద్యత వహించాలని అన్నారు …దానిపై బీజేపీ సోమవారం నిరసనలు తెలిపింది ..

మంగళవారం భట్టి వ్యాఖ్యలు తనకు పరువు నష్టం కలిగించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లీగల్ నోటీసులు పంపించడం ఆసక్తిగా మారింది ..

Related posts

అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది లేదు!: రాజాసింగ్

Ram Narayana

అదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్!

Ram Narayana

జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం, క్యాబినెట్ మంత్రులు …

Ram Narayana