సిపిఐ నేత బొల్లోజు అయోధ్య రోడ్ ప్రమాదంలో దుర్మరణం….
సూర్యాపేట వద్ద జరిగిన రోడ్ ప్రమాదం
ముందుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం …
సిపిఐ నేత ఉమ్మడి ఖమ్మం జిల్లా జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ ,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య రోడ్ ప్రమాదంలో దుర్మరణం చెందారు …. బుధవారం ఉదయం సూర్యాపేట లోని తన కూతురు ఇంటివద్ద నుంచి హైద్రాబాద్ బయలుదేరారు … అంతకు ముందు రోజు రాత్రి ఆయన మణుగూరు నుంచి సూర్యాపేటలోని తన కూతురు వద్ద రాష్ట్ర బస చేసి ఉదయం 5 గంటల ప్రాంతంలో హైద్రాబాద్ బయలుదేరారు …కొద్దీ సేపటికే సూర్యాపేట వద్ద జరిగిన రోడ్ ప్రమాదం లో ఆయన మృతి చెందారు … ఆసమయంలో తన కారులో డ్రైవర్ తో మాత్రమే ఉన్నారు … ముందుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో కారు లారీని బలంగా ఢీకొట్టింది .. ఈ ప్రమాదంలో అయోధ్య అక్కడికక్కడే మరణించగా , డ్రైవర్ కు గాయాలైయ్యాయి…ఆయన భౌతిక ఖాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ..అనంతరం అక్కడ నుంచి సిపిఐ ఖమ్మం జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్ ప్రజల దర్శనార్థం కొద్దిసేపు ఉంచి ,అక్కడ నుంచి కొత్తగూడెంలో సిపిఐ కార్యాలయంలో కొద్దీ సేపు ఉంచిన అనంతరం తన సొంత ఊరు మణుగూరు తరలిస్తారు …మణుగూరులో అంత్యక్రియలు జరుగుతాయని సిపిఐ నేతలు తెలిపారు …
బొల్లోజు అయోధ్య సిపిఐ జిల్లా నేతల్లో కీలక నేతగా ఉన్నారు …పినపాక నియోజకవర్గ అభివృద్ధి తోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు …రైతు కూలీలు ,రైతుల , కార్మిక వర్గ సమస్యల పరిస్కారం కోసం పనిచేసిన అయోధ్య మణుగూరు జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు …ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ కు వైస్ చైర్మన్ గా పనిచేశారు …మణుగూరు ,పినపాక ప్రాంతాల్లో పార్టీని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర చెప్పొకోదగ్గది ..
అయోధ్య రోడ్ ప్రమాదంలో మరణించారన్న వార్త సిపిఐ శ్రేణులను దిగ్బ్రాంతికి గురిచేసింది …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తన కార్యక్రమాలను రద్దు చేసుకొని అయోధ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలుదేరారు …సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు , సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు భాగం హేమంతరావు , సిపిఐ ఖమ్మం ,కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు , దండి సురేష్ , సాబీర్ పాషాలు అయోధ్య మరణంపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు …
నిబద్దత గల నాయకున్ని కోల్పోయాం -అయోధ్యకు సిపిఐ నేతల ఘన నివాళి


సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు బొల్లోజు అయోధ్య మరణంతో కమ్యూనిస్టు పార్టీ ఒక నిబద్దత కలిగిన నాయకున్ని కోల్పోయిందని సిపిఐ నేతలు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సిపిఐ నాయకుడు బొల్లోజు అయోధ్య మృతదేహాన్ని ఖమ్మం సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్కు తీసుకు వచ్చారు. సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, పాకాలపాటి వెంకటేశ్వరరావు (పెద్దాబ్బాయి), సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఎస్కి సాబీర్పాషా, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి తదితరులు అయోధ్య పార్దివ దేహంపై పూలమాలలు వేసి -నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ చిరుప్రాయంలోనే ఎర్ర జెండా పట్టిన అయోధ్య తుదిశ్వాస వరకు ఎర్రజెండా నీడలోనే పని చేశారని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తుదిశ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచిన నాయకుడన్నారు. అనేక అటుపొట్లను తట్టుకుని నిలబడిన అయోధ్య భూ పోరాటంలో పాల్గొని వందలాది ఎకరాల భూ పంపిణీ చేశారని ఆయన తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మణుగూరు ప్రాంతంలోని -వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నిర్మాణం కోసం అయోధ్య విశేష కృషి చేశారని ఆయన తెలిపారు. 1980 దశకంలో -అప్పటి పీపుల్స్ వార్ బెదిరింపులకు సైతం అయోధ్య భయపడలేదని హేమంతరావు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో నిలిచేవారని సమస్యల పరిష్కారం కోసం తాను ఎంచుకున్న మార్గంలో తుదివరకు పోరాడే వారన్నారు. ఆయన మరణం పేద ప్రజలకు, హక్కుల కోసం పోరాడే వారికి తీవ్ర నష్టమని ఆయన తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం పునరంకితమవుతామన్నారు. నివాళులర్పించిన వారిలో పాకాలపాటి లలిత రాజేశ్వరి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, -మిరియాల రంగయ్య, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, ముత్యాల సత్యనారాయణ, పలువురు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు ఉన్నారు.
సిపిఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య మృతి పట్ల తుమ్మల ,పొంగులేటి,నామ దిగ్బ్రాంతి

మంత్రి తుమ్మల సంతాపం
సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు బొల్లోజు అయోధ్య చారి గారు ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని తుమ్మల అన్నారు.పినపాక నియోజకవర్గం మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అయోధ్య గారు చేసిన సేవలు మరువలేనివి వారి మృతి సిపిఐ పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని లోటు నాలుగు దశాబ్దాల పాటు ప్రజాహక్కుల కొరకు అలుపెరగని పోరాటాలు చేసిన అయోధ్యగారు ఇక లేరు అన్న విషయం చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
మంత్రి పొంగులేటి సంతాపం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ప్రజా హక్కుల కోసం నిబద్ధతతో పోరాడిన కమ్యూనిస్టు యోధుడిగా అయోధ్య ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఆయన మృతి వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటు అని భావిస్తూ, కుటుంబ సభ్యులకు, సీపీఐ నాయకత్వానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ ఎంపీ నామ సంతాపం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు యోధుడని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడిన నాయకుడన్నారు. పల్లె ప్రజల అభివృద్ధి కోసం పట్టుదలతో పనిచేసిన నాయకుడు అయోధ్య అని ఆయన మృతి వామపక్ష రాజకీయాలకు, ముఖ్యంగా సీపీఐ పార్టీకి తీరనిలోటు అని పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన బొల్లోజు అయోధ్య ప్రజల మదిలో నిలిచిపోయే నాయకుడని నామ అన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరంగా పోరాడిన నాయకుడని కొనియాడారు. అయోధ్య కుటుంబ సభ్యులకు, సీపీఐ నాయకత్వానికి తన ప్రగాఢ సానుభూతిని నామ తెలియజేశారు.
ఎంపీ వద్దిరాజు దిగ్భ్రాంతి
సీపీఐ సీనియర్ నేత బొల్లోజు అయోధ్య ఆకస్మిక మరణం పట్ల రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయోధ్య మృతి చెందారు. ఆయన మరణం పట్ల రవిచంద్ర సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి పినపాక నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ నేతగా.. అక్కడి గిరిజనులకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని నివాళి అర్పించారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి, ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. అయోధ్య కుటుంబ సభ్యులకు, సీపీఐ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు.
CPM ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం *
సీపీఐ సీనియర్ నేత బొల్లోజు అయోధ్య ఆకస్మిక మరణం పట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయోధ్య మృతి చెందారు. ఆయన మరణం పట్ల సిపిఎం జిల్లా కమిటీ తరపున జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
సంతాపం వ్యక్తం చేశారు.
దశాబ్దాల తరబడి పినపాక నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ నేతగా.. అక్కడి గిరిజనులకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని నివాళి అర్పించారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి, ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. అయోధ్య కుటుంబ సభ్యులకు, సీపీఐ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి ని తన ప్రకటన లో తెలిపారు.
డాక్టర్ బానోత్ చంద్రావతి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు* కామ్రేడ్ బి. అయోధ్య * ఈరోజు ఉదయం మృతి చెందడం దురదృష్టకరమని తనకు తీవ్ర దిగ్బ్రాంతి కల్గించిందని వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి అన్నారు … పినపాక నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని అన్నారు . ఈ సందర్భంగా ఆయన మృతికి జోహార్లు అర్పిస్తూ , వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు ..