ప్రమాదాలు ...

ఘోర ప్రమాదం .. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్‌ ఇండియా విమానం

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మేఘానిలో ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే సివిల్‌ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై (Residential Area) విమానం కూలినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

స్నానం చేస్తుండగా పేలిన గీజర్.. కొత్త పెళ్లికూతురి మృతి

Ram Narayana

లిఫ్ట్ లో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత…

Ram Narayana

పెట్రోల్ పంప్ ముందు యాక్సిడెంట్.. భారీగా ఎగసిపడ్డ మంటలు.. ఐదుగురి మృతి..!

Ram Narayana