Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లు .. ఏ రాష్ట్రం టాప్ లో ఉందంటే

వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) ఆదాయం రికార్డు స్థాయిలో రోజు రోజుకు  పెరుగుతూ వస్తోంది. మే లో మొత్తం రూ.2.01 లక్షల కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో రూ. 5310 కోట్ల ఆదాయంతో 9 స్థానంలో ఉంది. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మే నెలలో రూ. 3803 కోట్ల ఆదాయంతో 12వ స్థానంలో ఉంది. మరోవైపు రూ. 31,530 కోట్ల ఆదాయంతో మహారాష్ట్ర దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది. రూ. 14,299 కోట్ల ఆదాయంతో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో తమిళనాడు రూ. 12.230 కోట్ల ఆదాయం రాబట్టింది.  గుజరాత్.. రూ. 11,737 కోట్ల ఆదాయంతో నాల్గో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఢిల్లి రూ. 10,366 కోట్ల ఆదాయం ఆర్జించింది. హర్యానా.. రూ. 10,170 కోట్ల ఆదాయంతో ఆరో స్థానంలో నిలిచింది. ఉత్తర ప్రదేశ్ రూ. 9,130 కోట్ల ఆదాయంతో ఏడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బంగాల్ రాష్ట్రం .. రూ. 6321 కోట్ల ఆదాయంతో ఎనిమిదో ప్లేస్ లో ఉంది. ఒడిషా.. రూ. 5108 కోట్ల ఆదాయంతో పదో స్థానం ఉంటే.. రాజస్థాన్ రూ. 4837 కోట్ల పదకొండో ప్లేస్ లో  ఉంది. మధ్య ప్రదేశ్ 3733 పన్నెండో స్థానంలో ఉంది.   కేరళ రాష్ట్రంలో  రూ. 3210 కోట్ల పదమూడు స్థానాల్లో నిలిచింది. జార్ఖండ్ రూ. 2907 కోట్ల ఆదాయంతో పద్నాలుగో స్థానంలో ఉంది. 

Related posts

ఇకపై యూపీఐ పేమెంట్స్ 15 సెకన్లలోనే పూర్తి

Ram Narayana

డిజిటల్ ట్యాక్స్‌ దెబ్బ .. కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు చేసిన ట్రంప్

Ram Narayana

లోగో మార్చిన బీఎస్ఎన్ఎల్…

Ram Narayana

Leave a Comment