జెండర్ గ్యాప్‌లో ఇండియా ర్యాంక్ చాలా తక్కువగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు ప్రకారం 131 స్థానంలో ఇండియా నిలిచింది. లింగ వ్యత్యాసం మరింత పెరిగినట్లు రిపోర్టు స్పష్టం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో 148 సభ్యదేశాలు ఉన్నాయి. దాంట్లో భారత్ 131 స్థానంలో నిలిచింది. గత ఏడాది నుంచి ఇప్పుడు రెండు స్థానాలు పడిపోయింది. సమానత్వం ఇండియాలో కేవలం 64.1 శాతమే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. దక్షిణాసియా దేశాల్లో ఇండియాదే అత్యల్ప స్థానం అని పేర్కొన్నారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టును గురువారం రిలీజ్ చేశారు. గత ఏడాది లింగ వ్యత్యాసం రిపోర్టులో ఇండియా 129వ స్థానంలో ఉన్నది. నాలుగు కీలకమైన అంశాల ఆధారంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ విశ్లేషణ చేస్తారు.
previous post