క్రికెట్ వార్తలు

డబుల్ సెంచరీ దిశగా జైస్వాల్

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 318-2 పటిష్ఠంగా ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (173), శుభ్మన్ గిల్ (20) ఉన్నారు. రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగితే భారత్ కు భారీ స్కోరు ఖాయం. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ నెగ్గిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జైస్వాల్- కేఎల్ రాహుల్ శుభారంభం ఇచ్చారు. 58 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ (38 పరుగులు)ను వారికన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ తో జైస్వాల్ జతకట్టాడు. ఈ ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ..క్రమంలోనే జైస్వాల్ 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతడికిది టెస్టుల్లో 7వ శతకం. మరోవైపు సుదర్శన్ కూడా చక్కటి ఆటతో అలరించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసి శతకం దిశగా సాగాడు. కానీ 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సుదర్శన్ను వారికన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. దీంతో 2 వికెట్కు 193 పరుగులు భారీ భాగస్వామ్యానికి తెర పడింది.

డబుల్ సెంచరీ దిశగా
తొలి రోజు ఇన్నింగ్స్ లో జైస్వాల్ ఆటే హైలైట్. ఎక్కడా బెదరకుండా, అనవసర షాట్లకు పోకుండా జైస్వాల్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. తొలుత రాహుల్, ఆ తర్వాత సుదర్శన్ తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. సుదర్శన్ ఔటైన తర్వాత వచ్చిన కెప్టెన్ గిల్ తోనూ జతకట్టాడు. ఈ క్రమంలోనే 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఆపైన కూడా ఓపిగ్గా ఆడుతూ గిల్ తో భాగస్వామ్యం నెలకొల్పాడు.

Related posts

క్రికెట్ కోసం ‘పదో తరగతి’ పరీక్షలకు దూరం: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం…

Ram Narayana

ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి .. స్పందించిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్

Ram Narayana

మూడో టీ20లో భారత్ ఘన విజయం.. ఆసీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు!

Ram Narayana