అంతర్జాతీయం

పాక్ నుంచి ట్రంప్ కుమారుడికి డబ్బు ముడుతోంది.. అమెరికా మాజీ రాయబారి

  • ఆ డబ్బు కోసమే భారత్ తో అమెరికా బంధాన్ని తెంచేస్తున్నాడని ఆరోపణ
  • 40 ఏళ్ల దౌత్య సంబంధాలను వదులుకున్నాడని ఫైర్
  • చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి భారత్

40 సంవత్సరాలుగా భారత్ తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అగ్రరాజ్యానికి చెందిన మాజీ రాయబారి రహమ్‌ ఇమాన్యుయేల్‌ పేర్కొన్నారు. ఈ కీలకమైన భాగస్వామ్యాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అహంభావంతో, తన స్వార్థం కోసం చెడగొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కుమారుడికి పాకిస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ముడుతోందని ఆరోపిస్తూ.. ఈ డబ్బు కోసమే ట్రంప్ భారత్ పై కక్ష కట్టారని పేర్కొన్నారు. తన స్వార్థం కోసం అమెరికా ప్రయోజనాలను కూడా పక్కన పెడుతున్నారని విమర్శించారు.

చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు అత్యంత కీలకమైన, నమ్మకమైన భాగస్వామి భారతదేశమేనని ఇమాన్యుయేల్ చెప్పారు. ఆ విషయాన్ని గుర్తించకుండా అధ్యక్షుడు ట్రంప్‌ అహం చూపిస్తున్నారు. భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది తానేనని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చడమూ ఓ కారణమేనని చెప్పారు. కాగా, రహమ్‌ ఇమాన్యుయేల్‌ గతంలో జపాన్ కు అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమెరికా, భారత్ సంబంధాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా .. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం!

Ram Narayana

అదే జరిగితే అణుబాంబు ప్రయోగిస్తాం.. పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక!

Ram Narayana

ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి

Ram Narayana