తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ అభ్య‌ర్ధి న‌వీన్‌ను గెలిపించండి…మంత్రి పొంగులేటి

-జూబ్లీహిల్స్ రెహ్మ‌త్‌న‌గ‌ర్ డివిజ‌న్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఆదివారం ప్రచారానికి చివరి రోజున విస్తృత ప్రచారం చేశారు ..గ‌త 12ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వ‌హించ‌లేద‌ని, ఫ‌లితంగా ఇక్క‌డ అభివృద్ది కుంటుప‌డినందున ఈ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి న‌వీన్ యాద‌వ్‌ను గెలిపించాల‌ని జూబ్లీహిల్స్ రెహ్మ‌త్‌న‌గ‌ర్ డివిజ‌న్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు కోరారు.

ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా ఆదివారం ఉద‌యం మంత్రి పొంగులేటి గారు రెహ్మ‌త్ న‌గ‌ర్ డివిజ‌న్‌లోని కార్మిక‌న‌గ‌ర్‌, బ్ర‌హ్మ శంక‌ర్ న‌గ‌ర్, రామిరెడ్డి న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్యటించి ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. సాయంత్రం రెహమత్ నగర్ నుంచి బోరబండ వరకు మంత్రి పొంగులేటి నిర్వహించిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. వేలాదిమంది కాంగ్రెస్ జెండాలు చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగలేటి స్ఫూర్తిదాయకంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పొంగులేటి ప్రసంగానికి ప్రజలు భారీగా స్పందించారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గడిచిన 23 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఈ ప్రాంతానికి ఎంతో సుపరిచితుడూ, యువకుడైన నవీన్ యాదవ్ కు అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గడిచిన 12 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించలేదు. 10 సంవత్సరాలు బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన ఎంఎల్ఏ ఉన్నాగానీ ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింద‌న్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకే సంపన్నుల నియోజకవర్గం.. వాస్తవానికి ఇక్కడ మెజారిటీగా ఉన్నది బడుగు, బలహీన, పేదలు నిరుపేదలే.వీళ్ల సంక్షేమాన్ని పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ఏనాడూ పట్టించుకోలేద‌ని మంత్రి విమ‌ర్శించారు

రాష్ట్ర ప్రభుత్వ పనితీరును గుర్తించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్‌లో 2వ నెంబ‌రు క‌లిగిన‌ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి మీ సంక్షేమానికి, కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేయాల‌ని, ఈ ప్రాంత‌ప్ర‌జ‌ల‌కు ఇంత‌కంటే మంచి అవ‌కాశం రాద‌ని మంత్రి పొంగులేటి అన్నారు.

Related posts

 డిసెంబర్ 9 తర్వాత నీ సంగతి చూస్తాం: బోధన్ ఏసీపీకి రేవంత్ రెడ్డి వార్నింగ్

Ram Narayana

ఏప్రిల్‌లో కవిత కొత్త పార్టీ ప్రకటన!

Ram Narayana

గిప్పుడే ఆట మొదలైంది …కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..!

Ram Narayana