ఖమ్మం వార్తలు

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతి సత్యనారాయణ… పాల్గొన్న ముగ్గురు మంత్రులు ..

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతి సత్యనారాయణ… పాల్గొన్న ముగ్గురు మంత్రులు ..
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం …భట్టి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ… దేశాన్ని పాలిస్తున్న బిజెపికి లేదు
పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తాలని సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు సూచించారు
దేశంలో ఎక్కడా లేని ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం మంగళవారం కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు
కేవలం సంక్షేమ పథకాల కోసమే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది
పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం ఏదో ఒక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ న్యాయం చేస్తాం
బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది
రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి గ్రామాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందాం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రేమ దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపికి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది రాగానే కుల గణన చేపడతామని మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు, ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సర్వే నిర్వహించాం, అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపాం, బిల్లు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లింది. ఇబ్బందులతో రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు ఆగిపోయిందని తెలిపారు. బిల్లును ఆమోదింప చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళాం ధర్నా చేశాం ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశామని డిప్యూటీ సీఎం వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టులు ఆదేశిస్తుండడంతో గ్రామపంచాయతీ ఎన్నికలకు వెళ్లాం బలహీన వర్గాలకు పార్టీ పరంగా కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును లేవనెత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఏం చేయకుండానే అన్నీ చేశామని మాటలు తప్ప బీఆర్ఎస్ నేతలు చేసింది ఏమీ లేదని డిప్యూటీ సీఎం అన్నారు, టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని పూర్తిస్థాయి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని కొత్తగూడెంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచ పటంలో ముందు ఉంచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట యూనివర్సిటీని నెలకొల్పామని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తలెత్తుకొని నిలబడేలా రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చూసేందుకు ఈనెల 10 నుంచి 13 వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు వచ్చి పాలుపంచుకోవాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి, గెలిపించుకోండి ప్రతి గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పది సంవత్సరాలపాటు పరిపాలించిన టిఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు, పేదలు ఇల్లు అని అరిచి గీ పెట్టినా పది సంవత్సరాల పాటు ఆనాడు పాలకులు పట్టించుకోలేదు అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి ఐదు లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 22 వేల కోట్లు ఖర్చు చేసి నాలుగున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తున్నామని వివరించారు. ఐదు లక్షలతో ఇల్లు నిర్మించడం ఇతర పాలకులతో సాధ్యం కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబట్టే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అని అన్నారు.
రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నాం దేశంలోనే ఈ పథకం ఎక్కడ అమలు కావడం లేదు, ప్రతినెలా ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం హిందూ గాను ప్రభుత్వ ఖజానాపై 13,500 కోట్ల భారం పడుతుంది అయినా పేదల కోసం ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదు అని తెలిపారు.
ఇందిరా క్రాంతి పదం పథకం కింద ప్రతి సంవత్సరం మహిళలకు 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటిస్తే ఇది అసాధ్యమని ఆనాడు హేళన చేశారు కానీ మేము మొదటి సంవత్సరం 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు పంపిణీ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని డిప్యూటీ సీఎం వివరించారు.
ఆర్థిక భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు ఇంటింటికి బొట్టు పెట్టి సారే చీర పంపిణీ చేశారని మహిళలు ఆత్మగౌరవం తో నిలబడేలా కార్యక్రమాన్ని తీసుకున్నారని వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించామని, రాష్ట్రంలో 51 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు 12 వేల ఆర్థిక సహాయం చేస్తున్నాం 9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి అని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండు లక్షల వరకు రుణమాఫీ ద్వారా 21 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. రైతులకు పంటలకు బీమా సౌకర్యం కల్పించాం పంట నష్టం జరిగితే ఎకరాకు 10000 చొప్పున రైతులకు అందించామని తెలిపారు. కేవలం సంక్షేమ పథకాల కోసమే 1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం రాష్ట్రంలో 29 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్తు అందించి 12,500 కోట్ల ఆర్థిక భారాన్ని రైతుల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందని తెలిపారు.
గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నెలనెలా సమీక్షిస్తున్నామని, రీ డిజైన్ పేరుతో రాజు ఇందిరా సాగర్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తి చేయలేదు కానీ మా ప్రభుత్వం రాగానే 100 కోట్లు కేటాయించి రాజీవ్ లింకు కెనాల్ ద్వారా వైరా ఎన్ఎస్పి కాలువకు కలిపి గోదావరి నీళ్లు పారిస్తున్నామని రెండో దశలో సత్తుపల్లి , పాలేరు నియోజకవర్గం గోదావరి నీటిని పారించేందుకు భూ సేకరణ జరుపుతున్నామని తెలిపారు.
భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచంతో పోటీపడేలా 2047 తెలంగాణ రైసింగ్ డాక్యుమెంట్ను ఈ నెల 9న ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుందో వివరించనున్నట్లు తెలిపారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నూతి సత్యనారాయణ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కావడమే కాదు వారి కుటుంబం స్వతంత్ర సమరయోధుల కుటుంబమని డిప్యూటీ సీఎం తెలిపారు. నూతి సత్యనారాయణ తండ్రి నూతి అనంతరాములు తెలంగాణ సాయుధ పోరాటంలో కర్ర సాము చేసి నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడారు, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రశంసా పత్రాలు పొందారని తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో కూడిన ఆధునిక కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణానికి తెలంగాణ క్యాబినెట్ ఎకరం స్థలం కేటాయించింది, ఈ స్థలానికి చెల్లించాల్సిన డబ్బులను కాంగ్రెస్ కార్యాలయం నుంచే మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ చెక్కు రూపంలో కలెక్టర్ కు డబ్బులు చెల్లించారని తెలిపారు. నూతన కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి నాయకులందరినీ భాగస్వాములుగా చేస్తాం అతి త్వరలో నిర్మాణ కమిటీని ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Related posts

కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ను తిలకించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Ram Narayana

నిరంకుశపాలనకు చరమగీతం పాడినరోజు…మంత్రి పొంగులేటి

Ram Narayana

పార్టీ మార్పు గురించి పువ్వాడ అజయ్ మాట్లాడటం హాస్యాస్పదం …కమర్తపు మురళి

Ram Narayana