జాతీయ వార్తలు

సలహాలన్నీ తీసుకోవాలి.. కానీ సరిపోయేది ఎంచుకోవాలి: మోదీ

  • విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని
  • ఇంటర్నెట్‌ చీప్‌ గా వస్తోందని సమయం వృథా చేసుకోవద్దని హితవు
  • ఆటలు ఆడటం సరదాగా చూడొద్దు.. అదొక నైపుణ్యమని సూచన

‘‘సలహాలు అన్నీ తీసుకోవాలి కానీ మనకు సరిపోయే సలహానే ఎంచుకోవాలి” అని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో ఒక బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఆటలను సరదాగా తీసుకోవద్దని, అదొక నైపుణ్యమని హితవు పలికారు. ఈ మేరకు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటించారు.

పనితీరుకు సంబంధించి ప్రజలు తనకు ఎన్నో విషయాలు చెబుతుంటారని, వారు ఇచ్చే సలహాలు అన్నీ దేశ ప్రధానిగా తాను స్వీకరిస్తానని మోదీ చెప్పారు. ఇలా స్వీకరించిన సలహాలు సూచనలతోనే తన పనివేళల్లో మార్పులు చేసుకున్నట్లు విద్యార్థులకు వివరించారు. అయితే, తాను విలువలను మాత్రం వదులుకోలేదని వివరించారు. ఈ సందర్భంగా జూదం జోలికి వెళ్లవద్దని వారిని హెచ్చరించారు. ఇంటర్నెట్‌ తక్కువ ధరకే లభిస్తుందని సమయం వృథా చేసుకోద్దని హితవు పలికారు. పరీక్షలను పండుగలా చేసుకోవాలని, మీతో మీరే పోటీపడాలని మోదీ వారికి సూచనలు చేశారు.

Related posts

తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేస్తా… ఈ బంధం కొనసాగాలి: రామ్మోహన్ నాయుడు

Ram Narayana

పసిమొగ్గల విక్రయం.. భారీ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు…

Ram Narayana

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్… కీలక నేత సహా 10 మంది మావోయిస్టుల మృతి!

Ram Narayana