- విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని
- ఇంటర్నెట్ చీప్ గా వస్తోందని సమయం వృథా చేసుకోవద్దని హితవు
- ఆటలు ఆడటం సరదాగా చూడొద్దు.. అదొక నైపుణ్యమని సూచన
‘‘సలహాలు అన్నీ తీసుకోవాలి కానీ మనకు సరిపోయే సలహానే ఎంచుకోవాలి” అని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో ఒక బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఆటలను సరదాగా తీసుకోవద్దని, అదొక నైపుణ్యమని హితవు పలికారు. ఈ మేరకు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటించారు.
పనితీరుకు సంబంధించి ప్రజలు తనకు ఎన్నో విషయాలు చెబుతుంటారని, వారు ఇచ్చే సలహాలు అన్నీ దేశ ప్రధానిగా తాను స్వీకరిస్తానని మోదీ చెప్పారు. ఇలా స్వీకరించిన సలహాలు సూచనలతోనే తన పనివేళల్లో మార్పులు చేసుకున్నట్లు విద్యార్థులకు వివరించారు. అయితే, తాను విలువలను మాత్రం వదులుకోలేదని వివరించారు. ఈ సందర్భంగా జూదం జోలికి వెళ్లవద్దని వారిని హెచ్చరించారు. ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తుందని సమయం వృథా చేసుకోద్దని హితవు పలికారు. పరీక్షలను పండుగలా చేసుకోవాలని, మీతో మీరే పోటీపడాలని మోదీ వారికి సూచనలు చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: