క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

లవ్ ట్రయాంగిల్.. ముంబైలో యువతి కాల్చివేత…

  • ప్రియుడి ప్రేయసిపై యువతి కాల్పులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టీనేజర్ మృతి
  • గంటల వ్యవధిలోనే నిందితుల అరెస్టు

ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరు యువతుల మధ్య వివాదం రేగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరూ గొడవ పడ్డారు. అందులో ఓ యువతి కోపం పట్టలేక కాల్పులు జరిపింది. బుల్లెట్ గాయంతో ఓ యువతి మరణించింది. ముంబైలోని శివాజీనగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

శివాజీ నగర్ కు చెందిన షిఫా షేక్ (19) స్థానికంగా నివాసం ఉండే ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఆ యువకుడు అప్పటికే మరో యువతి(25)తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అటు ఆ బంధం కొనసాగిస్తూనే షిఫాతోనూ ప్రేమ మొదలుపెట్టాడు. ఈ విషయం బయటపడడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం షిఫా షేక్ కు ఆ యువతి ఫోన్ చేసి మాట్లాడాలని ఫుర్కానియా మసీదు వద్దకు పిలిచింది.

అక్కడ ఇద్దరూ తమ ప్రియుడి గురించి వాదులాడుకున్నారు. మాటామాటా పెరగడంతో కోపం పట్టలేక ఆ యువతి వెంటతెచ్చుకున్న పిస్టల్ తీసి షిఫా షేక్ పై కాల్పులు జరిపి పారిపోయింది. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో బుల్లెట్ షిఫా షేక్ చెంప గుండా వెళ్లి పుర్రెలో చిక్కుకుంది. స్థానికులు వెంటనే స్పందించి షిఫా షేక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల సమాచారంతో నిందితులను గుర్తించారు. హత్య జరిగిన 12 గంటల్లోనే ప్రధాన నిందితురాలు (25 ఏళ్ల మహిళ)తో పాటు మరో 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

విమానంలో సీటు శుభ్రంగా లేదని ఇండిగోకు రూ.1.5 లక్షల జరిమానా!

Ram Narayana

30,000 మంది అతిథులు, 1,000 మంది వంటవాళ్లు.. మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యే కుమారుడి విందు!

Ram Narayana

భర్తను చంపించి పోలీసులకు ఫిర్యాదు చేసిన గడసరి భార్య …

Ram Narayana