ఆంధ్రప్రదేశ్

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం సిపిఐ దే …మద్దతు ఎవరిదీ …?

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం సిపిఐ దే …మద్దతు ఎవరిదీ …?అనేదానిపై సస్పెన్షన్ కొనసాగుతుంది ..మేయర్ పీఠం సిపిఐ కి ఇచ్చేందుకు కాంగ్రెస్ సైతం ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది ..ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేసి కొత్తగూడెం కార్పొరేషన్ లో కలిసి పనిచేద్దామని ఇది సీఎం మాటగానే సిపిఐ నేతల వద్ద ప్రతిపాదన చేసినట్లు సమాచారం . దీనిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం సమాలోచనలు చేసింది ..మిత్రపక్షమైన కాంగ్రెస్ తో కలిసి వెళ్లడమా …?లేక బీఆర్ యస్ బేషరత్ ఆఫర్ ను అంగీకరించడమా అనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు …మెజార్టీ అభిప్రాయం మాత్రం మిత్రపక్షమైన కాంగ్రెస్ మేయర్ పదవికి తమకు ఇచ్చేందుకు అంగీకరిస్తే వారితోనే కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం… బీఆర్ యస్ సిపిఐ కి ఆఫర్ ఇవ్వడంతో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా రాష్ట్ర రాజకీయల దృష్ట్యా సిపిఐ ని దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతో పావులు కదుపుతుంది …కొత్తగూడెంలో అన్ని తానై వ్యవహరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం సిపిఐ తమ మిత్రపక్షమేనని తాము స్నేహపూర్వక పోటీ చేశామని ప్రకటించడం గమనార్హం …

60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్ లో సిపిఐ 22 ,కాంగ్రెస్ 22 ,బీఆర్ యస్ 8 , సిపిఎం ఒకటి , బీజేపీ ఒకటి , స్వతంత్రులు 6 గురు గెలుపొందారు ..ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది …ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై బీఆర్ యస్ స్పందించింది . సిపిఐ కి బేషరత్ గా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ..ఈ మేరకు బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి , కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు స్వయంగా ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు ..సిపిఐ ,బీఆర్ యస్ కలిస్తే 30 డివిజన్లు వారి ఖాతాలో చేరినట్లు అవుతుంది ..వీరే గాక ఆరుగురు స్వంతంత్రుల్లో ఒకరు సిపిఐ మద్దతు దారు ఉన్నారని మిగతా వారు కూడా సిపిఐ కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు కూనంనేని సాంబశివరావు మీడియా సమావేశంలో పేర్కొన్నారు ..తామే సింగల్ గా గెలుస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న డాక్టర్ రామచందర్ నాయక్ తో పాటు కీలక మైన నేతలు ఓడిపోవడంతో కంగుతిన్నారు ..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికీ అనేదానిపై సస్పెన్షన్ కొనసాగుతుంది ..సిపిఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేయర్ ఫీఠం వదులుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది .సిపిఐ -కాంగ్రెస్ లు మిత్రపక్షాలేనని కొత్తగూడెం లో స్నేహపూర్వక పోటీ జరిగిందని మంత్రి పొంగులేటి చెప్పడం వెనక సిపిఐ కి మేయర్ ఇచ్చేందుకు అంగీకరించినట్లేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నెల 16 మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నందున సిపిఐ -కాంగ్రెస్ మధ్య చర్చలు ఒక కొలిక్కి వస్తాయా ..? లేక బీఆర్ యస్ తో కలిసి పీఠం దక్కించుకుంటుందా …? అనే ఉత్కంఠతకు తెరపడాలంటే మరో ఒకటి , రెండు రోజులు వేచి చూడాల్సిందే …మేయర్ పీఠం విషయంలో సిపిఐ రాజీ పడే అవకాశాలు లేవనే చెప్పాలి …

Related posts

అల్లర్లలో పాల్గొంటే సైన్యంలో ఉద్యోగం రాదు: వాయుసేనాధిపతి!

Drukpadam

ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా!

Ram Narayana

కొడుకు, కూతురే కాడెద్దులుగా… ఓ రైతు దయనీయ పరిస్థితి!

Ram Narayana