ఎంటర్టైన్మెంట్ వార్తలు

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం…

  • జయసుధకు ఏఎన్నార్ అవార్డు
  • ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్‌ రాంబాయి
  • ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌)
  • ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి)

2025లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ‘గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025’ విజేతలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఈరోజు విజేతల పేర్లను ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిలింలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు.
స్పెషల్ అవార్డులు:

  • ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు – చిరంజీవి
  • ఏఎన్నార్‌ అవార్డు – జయసుధ
  • పైడి జయరాజ్‌ అవార్డు – కమల్‌ హాసన్‌
  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనిదత్‌

ఫీచర్ ఫిల్మ్స్:

  • ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్‌ రాంబాయి
  • ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
  • ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌షో
  • ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌)
  • ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ బాలనటుడు – మాస్టర్‌ రోహన్‌ (ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో)
  • ఉత్తమ సహాయ నటుడు – శివాజీ
  • ఉత్తమ సహాయనటి – భూమిక (యూఫోరియా)
  • బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ – తండేల్‌
  • ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ సినిమా – కోర్ట్‌
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ
  • బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌ పరిచయ దర్శకుడు – సాయి మార్తాండ్‌ (లిటిల్‌ హార్ట్స్‌)
  • ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
  • ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్‌ రాబిన్‌ (దండోరా)
  • ఉత్తమ గాయకుడు – అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
  • ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ లిరిసిస్ట్‌ – నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్‌ – శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌).
  • ఉత్తమ సినీ గ్రంధం: ప్రభు (శూన్యం నుండి శిఖరాగ్రాలకు)
  • ఉత్తమ సినిమా విమర్శకుడు: హెచ్ రమేశ్ బాబు     

Related posts

అభిమానిపై చేయి చేసుకున్నందుకు నటుడు నానాపటేకర్ పశ్చాత్తాపం.. క్షమాపణ!

Ram Narayana

‘కొక్కరకో’ అంటూ బాడీగార్డ్ పోస్ట్.. విజయ్-త్రిషల బంధంపై క్లారిటీ ఇచ్చినట్టేనా?

Ram Narayana

అన్నపూర్ణ స్టూడియోస్ కి 50 ఏళ్లు… నాగార్జున

Ram Narayana