సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 3 గ్గురు డాక్టర్లు 3 గ్గురు సిస్టర్ల సస్పెండ్
6 గురు డాక్టర్లలో ముగ్గురు డుమ్మా …ముగ్గరు సిస్టర్లు కూడా
ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..విధులకు గైరాజర్ అయిన 50 మంది సిబ్బంది
కలెక్టర్ తీవ్ర ఆగ్రహం … వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు …
జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ హాస్పటల్ ను ఆకస్మికంగా తనిఖీచేశారు …కలెక్టర్ వెళ్లిన సమయంలో మొత్తం 50 మంది సిబ్బంది తమ విధుల్లో లేకపోవడం గుర్తించిన కలెక్టర్ సంబంధిత డాక్టర్లను ప్రశ్నించారు ..అందులో 44 మంది వివిధ విధుల్లో ఉన్నారని తెలపగా సంతృప్తి చెందిన కలెక్టర్ మిగతా ఆరుగురు పై చర్యలు ఆదేశాలు జారీచేశారు ..
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్…డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం..సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనిఖీ సమయంలో బయోమెట్రిక్ హాజరును పరిశీలించగా, మొత్తం 50 మంది బోధనా సిబ్బంది మరియు ఇతర సిబ్బంది విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్, సంబంధిత విభాగాల అధిపతుల నుండి వివరణ కోరారు. అందులో 44 మంది సిబ్బందికి సంబంధించి హెచ్ఓడిలు సహేతుకమైన కారణాలను తెలియజేశారు…మిగిలిన 6 మందిలో (3)డాక్టర్లు (3) సిస్టర్లు గైర్హాజరీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు పాటించాలని ఆదేశించారు.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆసుపత్రిలో సేవలను మరింత ఉన్నత స్థితిలో తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, అత్యవసర విభాగంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. .