Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

గురుకులాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్!

  • ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలనూ తేల్చనున్న టాస్క్‌ఫోర్స్
  • పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశాలు
  • ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం వడ్డించాలని స్పష్టీకరణ

గురుకులాలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవల గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఫుడ్ పాయిజన్‌‌కు గల కారణాలను టాస్క్‌ఫోర్స్ తేల్చనుంది.

ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను తేల్చి, బాధ్యులను గుర్తించనుంది.

పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని తెలంగాణ సీఎస్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంట చేసే ముందు కిచెన్‌ను పరిశీలించి పరిశుభ్రతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు ఆహారం వడ్డించాలి. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం- బీఆర్ఎస్ ను బొంద పెడుతాం… కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

Drukpadam

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు…కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో .చైర్మన్ పొంగులేటి

Ram Narayana

50 వసంతాల పి డి ఎస్ యు పోరాటాల చరిత్ర అజరామం!

Ram Narayana

Leave a Comment