అంతర్జాతీయం

మమ్మల్ని ఆపేదెవరు?… ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం

మమ్మల్ని ఆపేదెవరు?… ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం

2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తప్పుకోబోతోందంటూ వస్తున్న ఊహాగానాలకు ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) తెరదించింది. ఈ విషయంపై తమకు ఇరాన్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని సోమవారం స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌కు ఇరాన్ ఇప్పటికే అర్హత సాధించిన విషయం తెలిసిందే.

టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన తర్వాత ఈ ప్రచారం మొదలైంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మరణించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో, తమ జట్టు ప్రపంచకప్ లో పాల్గొనడం కష్టమేనని ఆ దేశ క్రీడాశాఖ మంత్రి వ్యాఖ్యానించడంతో గందరగోళం నెలకొంది.

ఈ పరిణామాలపై ఏఎఫ్‌సీ జనరల్ సెక్రటరీ విండ్సర్ జాన్ స్పందిస్తూ, “ఇది చాలా భావోద్వేగపూరిత సమయం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్యే. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, వారు వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నట్టు మాకు చెప్పారు. వారు మా సభ్యులు, వారు ఆడాలని మేము కోరుకుంటున్నాం. వారి సమస్యలు పరిష్కరించుకుని టోర్నీలో పాల్గొంటారని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

మరోవైపు, జరుగుతున్న ప్రచారాన్ని ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తీవ్రంగా ఖండించింది. ఫిఫా నిర్వహించే టోర్నమెంట్‌లో పాల్గొనకుండా తమను అడ్డుకునే అధికారం ఏ దేశానికీ లేదని తేల్చిచెప్పింది. “వరల్డ్ కప్ అనేది ఒక చారిత్రాత్మక ఈవెంట్. దీనికి నిర్వాహక సంస్థ ఫిఫానే తప్ప ఏ దేశమూ కాదు. మమ్మల్ని ఎవరూ ప్రపంచ కప్ నుంచి తప్పించలేరు” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఒకవేళ ఇరాన్ అధికారికంగా తప్పుకుంటే, ఆధునిక శకంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అవుతుంది.

mammullanni aapedevaru ..fifa world cup lo aadalani iran nirnayam…

Related posts

అబుదాబి లాటరీలో రూ.34 కోట్ల జాక్ పాట్ కొట్టిన ఎన్నారై.. ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

Ram Narayana

ట్రంప్ ఆ దేశాల‌పై ప‌న్నుల బాంబ్‌ పేల్చారుగా!

Ram Narayana

అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం ఆగాలంటే.. ఇరాన్ మూడు షరతులు!

Ram Narayana