ఆంధ్రప్రదేశ్

తిరుమలలో చంద్రబాబు… భక్తుల సౌకర్యాలపై ఆరా …!

సీఎం చంద్రబాబు తన మనవడు దేవాన్షు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల చేరుకున్నారు …అక్కడ అనంతరం సామాన్యుడిలా దర్శనం చేసుకున్నారు అనంతరం తిరుమలలో అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు …అన్నదాన కార్యక్రమానికి ట్రస్ట్ కు 44 లక్షలు అందజేసిన కుటుంబసభ్యులు అనంతరం అన్నదాన కార్యక్రమంలో చంద్రబాబు భక్తులకు వడ్డన చేశారు ..

సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

Chandrababu Naidu Family Visits Tirumala on Nara Devaansh Birthday

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, ఆయన ఎలాంటి ప్రోటోకాల్ తీసుకోకుండా సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల వచ్చారు. ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మహాద్వారం గుండా నేరుగా ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ, చంద్రబాబు తన పాత పద్ధతినే అనుసరించి సాధారణ క్యూలైన్‌లోనే వెళ్లారు.

ఏటా దేవాన్ష్ పుట్టినరోజున అన్నదానానికి విరాళం ఇవ్వడం ఆనవాయితీ
శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఈ అన్నదానం కోసం ఒక రోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను ఆయన కుటుంబం ఇప్పటికే శ్రీవారి అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందించింది. చంద్రబాబు నాయుడు ఈ ట్రస్టుకు విరాళం ఇవ్వడం ఇది 12వ సారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో భక్తి, సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన

Chandrababu Naidu visits Tirumala with Grandson serves food to Pilgrims

శ్రీవారి దర్శనం పూర్తయ్యాక, ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, దేవాన్ష్‌తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో మాడ వీధుల గుండా వెళ్తూ దారిపొడవునా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందిని పక్కకు జరిపి, భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. పలువురు భక్తులతో ఆయన, మనవడు దేవాన్ష్ కలిసి ఫొటోలు దిగారు. భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఈ సేవలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఇవిగో ఫొటోలు

Chandrababu Naidu Visits Tirumala Interacts with Pilgrims

దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు తిరుమల వీధుల్లో నడుస్తూ సామాన్య భక్తులతో ముచ్చటించారు. శ్రీవారి దర్శనం త్వరితగతిన పూర్తయ్యేలా చూసేందుకు త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నట్టు భక్తులకు హామీ ఇచ్చారు.

ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌, దేవాన్ష్ కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని, శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఒకరోజు వితరణ ఖర్చు కింద రూ.44 లక్షల భారీ విరాళాన్ని నారా కుటుంబం అందజేసింది. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌, దేవాన్ష్ స్వయంగా భక్తులకు అల్పాహారం వడ్డించి, వారితో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

ఈ కార్యక్రమాల తర్వాత సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ దిగి తిరుమల మాడ వీధుల్లో కొద్దిసేపు కాలినడకన పర్యటించారు. ఈ సమయంలో భక్తులను ఆపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉందని ప్రశ్నించగా, చాలా బాగుందని భక్తులు బదులిచ్చారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని పలువురు భక్తులు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. భక్తుల సౌకర్యం కోసమే టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, దర్శన ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏఐ టెక్నాలజీని తీసుకువస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

తీరాన్ని తాకిన ‘మొంథా’ తుపాను… కుండపోత వర్షాలతో కోస్తాంధ్ర అతలాకుతలం!

Ram Narayana

హిందూపురంలో కాల్పుల కలకలం.. రౌడీషీటర్‌పై పోలీసుల ఫైరింగ్

Ram Narayana

బాణసంచా పేలుడు ఘటన… పరారీలో తయారీ కేంద్రం యజమాని…

Ram Narayana