విమాన సిబ్బందిపై ఎమ్మెల్యే రోజా ఫైర్!
దారిమళ్లించి ఇబ్బందులకు గురిచేశారని ధ్వజం
బెంగుళూర్ లో దిగేందుకు 5 వేలు అడిగారని ఆరోపణ
మమ్మల్ని మానసిక వేదనకు గురిచేశారని విమర్శ
దీనిపై కోర్ట్ ను ఆశ్రయిస్తామన్న రోజా
ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడేలా ఇండిగో సంస్థ నిర్ణయం తీసుకోవడం సరికాదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమాన సిబ్బందిపై ఫైర్ అయ్యారు. సాంకేతిక లోపం ఉన్నా బెంగళూరుకు మళ్లించి డోర్లు తీయకుండా తమను మానసికంగా ఆవేదనకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో బెంగళూరు మళ్లించిన విషయం తెలిసిందే. ఆ విమానంలో రోజాతో పాటు తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు.
బెంగళూరులో విమానం ల్యాండైన అనంతరం ఈ ఘటనపై రోజా వీడియోలు విడుదల చేశారు. ఇండిగో సిబ్బంది, సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘వాతావరణం సరిగాలేకపోవడంతో బెంగళూరులో విమానం ల్యాండ్ చేశామని సిబ్బంది చెప్పారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో దిగాక సాంకేతిక సమస్య అని తెలిసింది. విమానంలో ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. ఒక్కొక్కరు రూ.5వేలు కడితేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్ చేశారు.. ఇది కరెక్ట్ కాదు. ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తాం. అసలు దిగాలంటే 5 వేలు ఎందుకు ఇవ్వాలనే దానిపై ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ప్రయాణికులు పరేషాన్ అయ్యారు. ఇండిగో సిబ్బంది ని నిలదీశారు. ప్రయాణికులు కేర్ విషయంలో ఇండిగో వ్యవహరించిన తీరుపై ప్రయనుకులు భగ్గుభగ్గుమంటున్నారు .దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే రోజా ప్రకటించారు.