Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ సీఎం జగన్ అధికారులతో వరస భేటీలు …రెండు బస్సు లలో వచ్చిన ఐపీఎస్ అధికారులు!

  • ఏపీ సీఎం జగన్ అధికారులతో వరస భేటీలు …రెండు బస్సు లలో వచ్చిన ఐపీఎస్ అధికారులు!
    -ఐపీఎస్ అధికారులతో కొనసాగుతున్న సమావేశం
    -ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు వాయిదా
    -చర్చల మధ్యలోనే వెళ్లిపోయిన సీఎస్ సమీర్ శర్మ

సీఎం జగన్ ఏపీలోని ఉన్నతాధికారులతో వరుసభేటీలతో బిజీ బిజీ గా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు ఏకంగా రెండు బస్సు లలో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అంతకుముందు సీఎస్ ఉద్యోగ సంఘాలతో జరుపుతున్న చర్చలు అర్థాంతరంగా వాయిదా వేసి సీఎం సమావేశానికి వెళ్లిపోయారు . అటు ఉద్యోగసంఘాల నేతలు కూడా ప్రభుత్వం పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటుందని ఆశతో ఎదురు చూశాయి. అయితే ఈ రోజు సీఎం ఉన్నతాధికారులు ,ఫ్లిప్ కార్ట్ సి ఐ ఓ కూడా సీఎం తో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ఉపాధి అవకాశాలు , రైతులకు సహకారం , మరిన్ని పెట్టుబడులు పెడతామని సి ఐ ఓ కళ్యాణ్ కృష్ణ మూర్తి తెలిపారు.

ఏపీ సీఎం జగన్ తో రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. ఐపీఎస్ అధికారులు రెండు బస్సుల్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది.

అటు, ఏపీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు వాయిదాపడ్డాయి. భేటీ అయిన కాసేపటికే సీఎంతో అత్యవసర సమావేశం ఉందంటూ సీఎస్ సమీర్ శర్మ వెళ్లిపోయారు. దాంతో చర్చలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

అంతకుముందు సీఎం జగన్ ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. దీనిపై కల్యాణ్ కృష్ణమూర్తి స్పందిస్తూ, ఏపీలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలపై తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నామని తెలిపారు. రైతులకు లబ్ది చేకూర్చే ప్రతిపాదనలను కూడా సీఎం ముందుంచామని వెల్లడించారు. సీఎం జగన్ తో సమావేశం ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు.

Related posts

మీరు లేకపోతే నేను లేను: ఉద్యోగులతో సీఎం జగన్!

Drukpadam

పోలీసులపై నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Ram Narayana

మూడవ రౌండ్ పూర్తి … పల్లా ఆధిక్యం 12142ఓట్లు

Drukpadam

Leave a Comment