Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మీరు పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేయించారా…?లేకపోతె చేయించండి …

మీరు పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేయించారా…?లేకపోతె చేయించండి 

  • రైతులకు మూడు విడతల్లో కేంద్రం సాయం
  • రెండు వేల చొప్పున ఏటా రూ.6 వేల సాయం
  • పీఎం కిసాన్ ను ఆధార్ తో లింక్ చేయాలంటున్న కేంద్రం
  • వెబ్ సైట్ ద్వారా ఈ-కేవైసీ చేయించుకోవచ్చని వెల్లడి

కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం కింద ఏటా రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అందించే ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది రైతులు లబ్ది పొందుతున్నారు. అయితే పీఎం కిసాన్ పథకంలో నమోదైన రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. త్వరలో రైతుల ఖాతాలో మరో రూ.2 వేలు జమ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబరును పీఎం కిసాన్ ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి ప్రవేశించి ఈ-కేవైసీ ఆప్షన్ ద్వారా ఆధార్ నెంబరు లింక్ చేసుకోవచ్చని వెల్లడించింది.

ఆధార్ కార్డుతో మొబైల్ నెంబరు లింక్ అయిన వారికే ఈ ఆప్షన్ వర్తిస్తుంది. ఆధార్ కార్డుతో మొబైల్ నెంబరు లింక్ కాని వారు మొదట సమీపంలోని సీఎస్ సీ కేంద్రం ద్వారా ఆధార్ కార్డుతో మొబైల్ నెంబరు లింక్ చేయించుకోవాలి. ఆపై అక్కడే పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.

Related posts

విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా గుట్టు రట్ట…

Ram Narayana

అత్యాధునిక పరికరాలతో సరిహద్దులను కట్టుదిట్టం చేస్తున్న బీఎస్ఎఫ్!

Drukpadam

పొంగులేటిని రాహుల్ టీమ్ కలిసిందా….?

Drukpadam

Leave a Comment