Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గోల్డెన్ సూట్ కేసుతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన నాగచైతన్య… ఎలిమినేట్ అయింది ఎవరంటే…!

గోల్డెన్ సూట్ కేసుతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన నాగచైతన్య… ఎలిమినేట్ అయింది ఎవరంటే…!
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్
స్టేజిపై నాగచైతన్య
ప్రొ కబడ్డీ కోసం ప్రచారం
గోల్డెన్ సూట్ కేసు ఇచ్చి హౌస్ లోకి పంపిన నాగ్

బిగ్ బాస్ రియాలిటీ షో ఐదో సీజన్ మరికాసేపట్లో ముగియనుంది. తాజాగా యువ హీరో అక్కినేని నాగచైతన్య ప్రొ కబడ్డీ ప్రచారం కోసం బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున… గోల్డెన్ సూట్ కేసును నాగచైతన్యకు ఇచ్చి బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు.

హౌస్ లోకి వెళ్లిన చైతూ… హౌస్ లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్రలకు ఆఫర్ ఇచ్చాడు. నాని తీసుకువచ్చింది సిల్వర్ సూట్ కేసు అని, తాను గోల్డెన్ సూట్ కేసుతో వచ్చానని, అందులో నాని తెచ్చిన డబ్బు కంటే మూడు రెట్లు అధికంగా డబ్బు ఉందని తెలిపాడు. హౌస్ నుంచి బయటికి వచ్చేయాలనుకుంటే ఆ సూట్ కేసులో ఉన్న డబ్బంతా వారి సొంతం అవుతుందని ఊరించాడు. అందుకు కంటెస్టెంట్లు అంగీకరించకపోవడంతో నాగ్… స్టేజిపై నుంచి ఎలిమినేషన్ ప్రకటించారు. శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయినట్టు వెల్లడించగా, శ్రీరామచంద్రతో కలిసి నాగచైతన్య తిరిగి స్టేజిపైకి వచ్చాడు.

ఇక, ప్రతి సందర్భంలోనూ ఓ పాట పాడే శ్రీరామచంద్ర… వేదికపైకి వచ్చి అక్కడే ఉన్న తన తల్లిని చూసి పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా అంటూ పాట పాడి అలరించాడు. కాగా, నాగచైతన్యతో పంపిన సూట్ కేసులో రూ.20 లక్షలు ఉన్నాయని నాగ్ వెల్లడించారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో సన్నీ, షణ్ముఖ్ మిగిలారు. కాసేపట్లో వీరిద్దరిలో విన్నర్ ఎవరో అధికారికంగా ప్రకటించనున్నారు.

Related posts

వైఎస్ వర్ధంతి నాడు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం..

Drukpadam

బ్రెజిల్ అధ్యక్షుడిపై ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం.. మాట్లాడుతుంటే గిన్నెలతో శబ్దాలు!

Drukpadam

పిలవని పేరంటాలు… ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులపై కేసు

Ram Narayana

Leave a Comment