ఏపీసీసీ అధ్యక్షుడి రేసులో ముగ్గురు నేతలు!
-కసరత్తును పూర్తి చేసిన ఏపీ పార్టీ ఇంఛార్జీ ఉమన్ చాందీ
-పలువురు కీలక నేతల అభిప్రాయాలను తీసుకున్న చాందీ
-రేసులో చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, హర్షకుమార్
రాష్ట్రము విడిపోయినతరువాత ఏపీలో కాంగ్రెస్ అడ్రెస్స్ లేకుండా పోయింది. కనీసం ఒక్కటేంటే ఒక్క అసెంబ్లీ సీటు గెలిచే పరిస్థితి లేదు …ఏపీ మొదట కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్ రఘువీరారెడ్డి ని నియమించారు. తరువాత ఆయన తప్పుకున్నారు సాకే శైలజానాథ్ ను నియమించారు . ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ని పూర్తిగా ప్రక్షాళన చేయాలనీ ఏఐసీసీ నిర్ణయించింది. కొంత కాలం క్రితం రాహుల్ గాంధీతో సమావేశం రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతల సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , కెవిపి రామచందర్ రావు ,పల్లం రాజు శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రము లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ,కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. దీంతో ఇటీవల దీనిపై కసరత్తు చేశారు . ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో గిడుగు రుద్రరాజు , హర్ష కుమార్ , చింత మోహన్ పేర్లు ఉన్నాయి. మరి వారే అవుతారో లేక మరొకరిని పెడతారో చూడాలి ….
ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తయింది. అధ్యక్షుడి ఎంపిక కోసం ఏపీ ఇంఛార్జీ ఉమన్ చాందీ పలువురు రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించారు. వీరిలో ఏపీ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాలు, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు.
ముఖాముఖి సమావేశాలతో అందరి అభిప్రాయాలను ఉమన్ చాందీ తీసుకున్నారు. అధ్యక్షుడి రేసులో చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, హర్షకుమార్ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. వీరి ముగ్గురిలో ఒకరికి ఏపీసీసీ అధ్యక్ష భాధ్యతలు దక్కనున్నాయి. జనవరి మొదటి వారంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదికను అందించనున్నారు. ఉమన్ చాందీ బృందం సంప్రదించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు తదితరులు కూడా ఉన్నారు.