Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన జగన్!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన జగన్!
-సిజెఐ గౌరవార్థం ఏపీ ప్రభుత్వ హై – టీ ఏర్పాటు
-హాజరైన సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ ,పలువురు సుప్రీం కోర్ట్ జడ్జీలు
-తెలంగాణ , ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
-ఏపీ పర్యటనలో ఉన్న ఎన్వీ రమణ
-కడప పర్యటనను పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న జగన్
-సతీసమేతంగా సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను ఏపీ సీఎం జగన్ కలిశారు. తన భార్య భారతితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్… తన పర్యటనను ముగించుకుని ఈ మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు.

తర్వాత నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లిన జగన్… అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. మరోవైపు నిన్న తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరంకు ఎన్వీ రమణ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ఇరు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లు, పలువురు ఏపీ మంత్రులు హాజరయ్యారు.

అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో రాష్ట్ర ప్రభుత్వం సిజెఐ గౌరవార్థం ఏర్పాటు చేసిన హై-టీ కార్యక్రమంలో లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజెఐ తో పాటు సుప్రీం కోర్ట్ , హై కోర్ట్ జడ్జీలను శాలువాలతో సీఎం జగన్ ఘనంగా సత్కరించారు.తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహాలను అందించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు ,రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ,డీజీపీ , ఇతర ఉన్నతాధికారులు , హైకోర్టు ,సుప్రీం కోర్ట్ జడ్జీలు పాల్గొన్నారు.

 

 

Related posts

మందడంలో భోగి వేడుకలు.. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

Ram Narayana

అభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం మరువలేనిది…మంత్రి సింగిరెడ్డి

Drukpadam

 చీఫ్ విప్ లు, విప్ లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Ram Narayana

Leave a Comment