మడమ తిప్పని సంఘం టీఎన్జీవోస్ యూనియన్….
సీఎం ని ఒప్పించి ఉద్యోగుల పీఆర్సీ పెంచేందుకు కృషి చేశాం..
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష ఎన్నిక మీటింగ్ లో సెంట్రల్ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్…..
రాష్ట్రంలో మడమ తిప్పని సంఘం ఏదైనా ఉందా అంటే అది ఒక్క టీఎన్జీవోస్ సంఘమేనని,75 ఏళ్లుగా ఉద్యోగుల హక్కుల సాధనకై కృషి చేస్తానందని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఉద్యోగులు మెరుగ్గా జీవించడానికి 11 వ పీఆర్సీ తొలి పీఆర్సీ వర్తిస్తాదా…లేదా అనే సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం ఏడున్నర శాతం రికామాండ్ చేయడంతో ,ఉద్యోగుల పక్షాన నిలబడి పక్క రాష్ట్రం లో 27 శాతం పీఆర్సీ ఇవ్వగా అట్టి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఏడున్నర శాతం నుంచి 30 శాతం కు కృషి చేసినట్లు తెలిపారు.దింతో 4 లక్షల మంది ఉద్యోగులతో పాటు కాంటాక్ట్,ఔట్ సోర్సింగ్ తదితర వారందరికీ వర్తించిందన్నారు. ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్ష నియామకం లో భాగంగా ఖమ్మంలోని గ్రాండ్ గాయత్రి హోటల్ లో నిర్వహించిన సమావేశానికి షేక్ అఫ్జల్ హసన్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశానికి టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్,ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ ల తో పాటుగా వరంగల్ జిల్లా అధ్యక్షులు రాంకిషన్ రావు, కార్యదర్శి వేణుగోపాల్ ,కోశాధికారి సదానంద్,సెంట్రల్ కోశాధికారి కొణిదల శ్రీనివాస్ లు హాజయ్యారు.
ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ ఎన్జీవో,టీఎన్జీవో ల రూపం వేరైనా ఉద్యోగుల సమస్యల సాధనే ద్యేయం అన్నారు.సీఎస్పీ రద్దుకు, ఉద్యోగులు విధి నిర్వహణలో చనిపోతే పెన్షన్ ఇచ్చే బాధ్యత తీసుకొని భరోసా కల్పించిందన్నారు.2018 ప్రెసిడెన్షియల్ ప్రకారం బదిలీలు జరగాలి?కానీ ఉద్యోగుల విభజన జరిగిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఒప్పించి స్పోస్ కేటగిరి, రాయితీపై జీవో కల్పించామని గుర్తు చేశారు.ఎక్కడి ఉద్యోగులు అక్కడే ఉండేందుకు జీవో తెచ్చామన్నారు.
టీఎన్జీవో జిల్లా కన్వినర్ అఫ్జల్ హసన్ కు యూనిట్ల ఎంపికపై ఆరు నెలలు గడువు ఇవ్వగా నెలలోపే పూర్తి చేసి తన సమర్ధత నిరూపించుకున్నారని తెలిపారు.ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయం ను కొరదామని అన్నారు.
అనంతరం సెంట్రల్ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ టీఎన్జీవో యూనియన్ తన పంథాను మార్చుకొని కొత్త ఓరవాడితో పని చేస్తోందన్నారు.నాయకులు కూడా చరిష్మా కలిగిన వారు ఉండటం సంతోషం అన్నారు.అఫ్జల్ హసన్ తో నూతన ఒరవడి రావాలని చెప్పారు.
టీఎన్జీవోస్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం…….
టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా షేక్ అఫ్జల్ హసన్, ఉపాధ్యక్షులుగా చుంచు వీర నారాయణ లతో కలిపి 18 మందిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఖమ్మం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో కలిపి 18 పదవులకు ఈ నెల 15 న నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఈ ఎన్నికకు రెవెన్యూ సోసియేషన్ జిల్లా అధ్యక్షులు, సుజాత నగర్ తహసిల్దార్ సునీల్ రెడ్డి లు ఎన్నిక అధికారిగా వ్యవహరించారు.
16 న షెడ్యూల్ ను పెట్టారు.18 న నామినేషన్ ప్రక్రియ ముగింపు జరిగింది. 19 న స్క్రు నీటి నిర్వహించారు.మొత్తం 18 పోస్టులకు గాను మొత్తం 18 సింగిల్ నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.