క్రైమ్ వార్తలు

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో దారుణం!

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో దారుణం!
వ్యక్తి తలమొండం వేరు చేసి దేవత కాళ్ళ దగ్గర పెట్టిన హంతకులు
భయాందోళనలో ఆ చుట్టుపక్క గ్రామాల ప్రజలు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో దారుణం చోటు చేసుకొన్నది . నాగార్జున సాగర్ -హైద్రాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో మహంకాళి అమ్మవారి విగ్రహం కాళ్లదగ్గర గుర్తుతెలియని వ్యక్తి మొండం -తలా వేరుచేసి పెట్టడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది . మొండం తల వేరు చేసి పెట్టిన తీరు చూసిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న చింతపల్లి పోలీసులు వచ్చి మొండం తలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది నరబలి కోసం ఇంకేమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే కావడంతో ప్రజలు చుట్టుపక్కలనుంచి తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు . హత్య కావింప బడిన వ్యక్తి ఎవరు ? ఎక్కడ చంపారు ?ఇందులో ఎంతమంది పాల్గొని ఉంటారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు .

హైదరాబాద్-నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి పై ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో దేవత కాళ్ళ విగ్రహం వద్ద వ్యక్తి మొండెం వేరు చేసిన తల.వ్యక్తిని చంపి తలను వదిలి పెట్టి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.భయాందోళనకు గురవుతున్న స్థానికులు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు .

Related posts

కర్రెగుట్టల్లో ఎంకౌంటర్ … 22 మంది మావోలు మృతి ?

Ram Narayana

వివేకా హత్య కేసు: సీబీఐ నోటీసులు తీసుకోని వైయస్ అవినాశ్ రెడ్డి!

Drukpadam

ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో నీటమునిగి ఐదుగురు టీనేజర్ల దుర్మరణం!

Drukpadam