Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిజమాబాద్ సి.పి. కె.ఆర్. నాగరాజుకి , ఎం.పి అరవింద్ క్షమాపణ చెప్పాలి.

నిజామాబాద్ సిపి నాగరాజు పై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు భగ్గుమన్న ప్రజా సంఘాలు
ఖమ్మం డీఆర్వో శిరీషకు వినతిపత్రం
చట్టాలను అగౌరవ పరచడం …ఆయన దురహంకారానికి నిదర్శనం
నిజమాబాద్ సి.పి. కె.ఆర్. నాగరాజుకి , ఎం.పి అరవింద్ క్షమాపణ చెప్పాలి.
వివిధ ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ .

నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ మండలములోని ఇస్సాపల్లి పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో జరిగిన సంఘటన విషయంలో దళిత సి.పి. అయిన కె.ఆర్. నాగరాజు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజమాబాద్ ఎం.పి. అరవింద్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని , ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రజా సంఘాలు , కుల సంఘాల ప్రజలు డిమాండు చేశాయి . ఆధిపత్య కులాలైన పాలక వర్గాలు బహుజనుల ఓట్ల కొనుగోలుతో గెలిచి , చట్టసభల్లో ప్రవేశించి వారు చేసిన చట్టాలను అగౌరపరుస్తూ , సమానత్వమనే రాజ్యాంగ విలువలు మరిచి , కుల దురహంకారంతో దూషించటం . దళిత అధికారులు తమ బానిసలుగా ఉండాలనుకోవటం . పార్లమెంరీ వ్యవస్థను కించపరచట మేనని ప్రజాసంఘాలు మండిపడ్డాయి . ఎస్.సి., ఎస్.టీ. చట్టాన్ని అదొక లొట్టపీసు చట్టం అని చట్టాలు చేసే ఒక ఎం.పి అనటం , ఒక పార్లమెంటు సభ్యుడు అయి ఉండి అన్ పార్లమెంటరీ పదం పలకడం తమ పదవి కుల అధికార దర్పణమే కారణం అని , ఓట్లేసిన ప్రజలను కించపర్చటం . మేము ఏమి అన్నా చెల్లుతుంది అనుకోవడం సబబు కాదని హెచ్చరించారు . అణచి వేయబడిన వారి పిల్లలు వెలివాడలలో ఎన్నో కష్టాలు పడి విద్యావంతులై చట్టాలు తెలిసికొని వాటిని అమలు పరచటం తప్పా ? అని ప్రశ్నించారు . అంబేడ్కర్ గారి దయవలన ఆయన రాసిన రాజ్యాంగం వలన , బహుజనుల ఓట్ల వలనే ఈ పదవులు అని ఇకనైనా గ్రహిస్తే మంచిదని , భవిష్యత్తులో ఇలాంటి అనుచిత మాటలు దళిత అధికారులపై ప్రయోగించ రాదని , రాజ్యాంగ స్ఫూర్తి కలిగి చట్టసభ గౌరవాన్ని కాపాడాలని సూచన చేశారు . లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు . మిమ్ములను నిత్యం కాపాడేది పోలీసులేనని , వారి రక్షణ లేకుండా మీరు ప్రజల్లోకి వెళ్లలేరని అలాంటి బాధ్యత కలిగిన అధికారులను దూషించటం మంచిది కాదని., మీ తోటి పాలకుల ఆదేశాలనే పాటిస్తారని వారిని మిమ్ములను ఒప్పించలేక పోలీసులు మధన పడుతున్నారని మేధావులు ఆవేదన వ్యక్తపరిచారు . ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సంఘాలు పాల్గొన్నాయి . ఎస్సి ఎస్టీ విజిలెన్స్ జిల్లా కమిటీ & మాల మహానాడు రాష్ట్ర నాయకులు గుంతేటి వీరభద్రం , బి సి సంగం జాక్ జిల్లా నాయకులు వల్లెపు సోమరాజు , బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ , పూలే అంబెడ్కర్ సంగం నాయకులు కనకయ్య , భహుజన నాయకులు శ్రీనివాస్ , రిటైర్డ్ ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంగం నాయకులు ఎల్లయ్య , జిల్లా మాల మహానాడు అధ్యక్షులు ఎం.జాకబ్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక.. కొత్త పార్లమెంట్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

Drukpadam

జగన్‌ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ: చంద్రబాబు మండిపాటు..!

Drukpadam

ఈడీ ప్ర‌శ్న‌కు తానిచ్చిన‌ ఆన్స‌ర్‌ను చెప్పిన రాహుల్ గాంధీ.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్!

Drukpadam

Leave a Comment