Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ, ఈ-పాస్ పోర్టులు.. కేంద్ర బడ్జెట్!

ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ, ఈ-పాస్ పోర్టులు.. కేంద్ర బడ్జెట్!

  • రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం
  • బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ
  • పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

  • ఐదు నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డీపీఆర్ సిద్ధమైంది.
  • రూ. 44,605 కోట్లతో కేన్-బేట్వా నదుల అనుసంధానం.
  • ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇచ్చేందుకు నిధులను మరో 2 లక్షల కోట్లను పెంచుతున్నాం.
  • 2 లక్షల అంగన్ వాడీలలో వసతులను మెరుగుపరుస్తాం.
  • ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను పెంచుతున్నాం.
  • డిజిటల్ పేమెంట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు. కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 యూనిట్ల ఏర్పాటు.
  • బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీ.
  • అత్యాధునిక టెక్నాలజీతో చిప్ ఉన్న ఈ-పాస్ పోర్టులు.
  • 8 ప్రాంతీయ భాషల్లో ల్యాండ్ రికార్డులు. 
  • కరోనా వల్ల విద్యను కోల్పోయిన విద్యార్థుల కోసం వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్.
  • 2022-23లో 5జీ సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తాయి.
  • 2025 కల్లా భారత్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం.
  • అన్ని పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తో అనుసంధానం చేస్తాం.
  • రక్షణ రంగానికి కావాల్సిన వాటిని 68 శాతం దేశీయ పరిశ్రమల నుంచే సమకూర్చుకుంటాం. రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం. 
  • పురుగు మందుల వినియోగం కోసం డ్రోన్ల సహకారం.
  • యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
  • పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం.
  • ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ.
  • అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగిత రహిత వ్యవస్థను తీసుకొస్తాం.
  • బొగ్గును రసాయనంగా మార్చేందుకు ప్రత్యేక పథకం.
  • విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు.

Related posts

తిరుమల క్యూలైన్‌లో ఫ్రాంక్ వీడియో… విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ

Ram Narayana

గంభీర్ పైకి దూసుకెళ్లిన కోహ్లీ.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..

Drukpadam

లైంగిక క్రూర‌త్వానికి వివాహం లైసెన్స్ కాదు: క‌ర్ణాట‌క హైకోర్టు

Drukpadam

Leave a Comment