రాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల ,పొంగులేటి ప్రకంపనలు!

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల ,పొంగులేటి ప్రకంపనలు
-తుమ్మల అనుయాయుల రహస్య భేటీ
-పాలేరు నుంచి తమ నేత పోటీ చేస్తారన్న తుమ్మల వర్గీయలు
-ఆయన వెంటే తాము అని వెల్లడి
-పొంగులేటి వ్యూహాత్మకంగా అడుగులు
-కేటీఆర్ తనను కాపాడతాడని నమ్మకం
-వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమని వివరణ
-టీఆర్ యస్ ఆదరించకపోతే తమ దారి తాము చూసుకొనే ఆలోచనలో నేతలు

ఎన్నికలకు మరో సుమారు రెండు సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి తెలంగాణ లో ఇప్పుడే ఎన్నికల వేడి ప్రారంభం అయింది. దీనికి కారణం లేకపోలేదు ..ఎన్నికలు షడ్యూల్ ప్రకారం పెడతారా ? లేక ముందస్తు కు వెళతారా ? అనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ బీజేపీ పై యుద్ధం ప్రకటించి దేశవ్యాపితంగా పర్యటనలు చేస్తున్నారు.బీజేపీ టీఆర్ యస్ మధ్య ప్రస్తుతానికి పెద్ద గ్యాప్ ఉంది. అయితే దీనిపై సందేహాలు లేకపోలేదు … కేసీఆర్ గతంలో కూడా థర్డ్ ఫ్రంట్ అంటూ ఫ్రంట్ లేదు టెంట్ లేదు అని తరువాత చెప్పిన మాటలతో ఖంగు తినడం రాజకీయపార్టీల వంతైంది. ఇప్పడు మళ్ళీ ఎన్నికల వేడి రాజు కుంటుంది. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతలు గా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ విస్మరించారని జరుగుతున్నా ప్రచారం నేపథ్యంలో వీరి అడుగులు వేటు వైపు అనే చర్చ సహజంగానే జరుగుతుంది.

కేసీఆర్ నుంచి వీరికి పిలుపు లేదు . … ఎమ్మెల్సీ ఎన్నికల్లో గానీ రాజ్యసభ ఎన్నికల్లో గానీ వీరి పేర్లను కనీసం పరిశీలించకపోవడం పై అనుయాయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత జూనియర్ అయిన తాతా మధుకు టికెట్ ఇవ్వడమే కాకుండా జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై కూడా అసమ్మతి ఉంది.

ఇద్దరు నేతలు తరుచు జిల్లాలో పర్యటిస్తూ క్యాడర్ ను కాపాడుకుంటున్నారు… ఇతర పార్టీలనుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి . అయినప్పటికీ వాటిని వారు సున్నితంగా తిరస్కరిస్తున్నారు . గొద్దిరోజుల క్రితం మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి మరో అసమ్మతి నేత ఖమ్మం వచ్చి తుమ్మల ,పొంగులేటిలను కలిశారు. అయితే ఆయన ఆయిల్ ఫారం సాగు చూసేందుకు వచ్చారని చెబుతున్న వారు భేటీలో రాజకీయాలు కూడా చోటు చేసుకొన్నట్లు సమాచారం . దీంతో ఈభేటీ రాష్ట్ర వ్యాపితంగా చర్చనీయాంశం అయింది.

తుమ్మల అనుయాయిలు భేటీ కాగా , పొంగులేటి మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని కుండబద్దలు కొడుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. తనకు కేటీఆర్ ఉన్నారని ఆయనపై తనకు నమ్మకం ఉందని తరుచు చెబుతున్నారు. ఆయన అనుయాయులు మాత్రం ఆయనపై వత్తిడి తెస్తున్నారు. టీఆర్ యస్ ఆదరించకపోతే తనదారి తాను చూసుకొనే ప్లాన్ లో ఉన్నారు .

ఇద్దరు నేతలు కచ్చితంగా టీఆర్ యస్ నుంచి తమకు ఆదరణ లభించకపోతేనే వేరే దారి వెతుక్కునే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే జిల్లాలో టీఆర్ యస్ కు భారీ నష్టం జరగటం ఖాయం ….

Related posts

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి శరద్ పవర్ నో ….

Drukpadam

టికెట్ ఆశించి భంగపడిన బీఎస్పీ నేత.. బోరున ఏడ్చిన వైనం !

Drukpadam

జగన్, పొంగులేటి భేటీ …వ్యాపారమా …? రాజకీయమా …??

Drukpadam