Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని మునుగోడు నుంచి పోటీకి సిద్దపడుతున్నారా?

కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని మునుగోడు నుంచి పోటీకి సిద్దపడుతున్నారా?
-ముందస్తు ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారా??
-ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ లో భాగంగానే నియోజకవర్గం మారనున్నారా ???
-రాజకీయ చాణిక్యుడు ఏమి చేయబోతున్నారు
-రాష్ట్ర రాజకీయాల్లో ఆశక్తి

కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది. పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపడంతోపాటు , టీఆర్ యస్ కు ప్రతికూలంగా ఉన్న జిల్లా నుంచి పోటీచేస్తే దానిప్రభం జిల్లాపై పడుతుందని అంటున్నారు . ముందస్తు ఎన్నికల కోసం రంగం సిద్ధం చేస్తున్నారని , ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ లో భాగంగానే కేసీఆర్ నియోజకవర్గం మారోతున్నారని మరో ప్రచారం ఉంది. రాజకీయచాణిక్యుడిగా పేరున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో ఆశక్తిగా మారింది.

టీఆర్ యస్ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసిన దానికి కారణం ఉంటుంది. రాజకీయాల్లో అపరచాణిక్యుడిగా ఆయనకు పేరుంది. ఎత్తుగడలు వేయడంలో , వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో దిట్టగా పేరున్న కేసీఆర్ ఈసారి గజ్వేల్ నుంచి వేరు నియోజకవర్గానికి మారుతున్నారని టాక్ . కాంగ్రెస్ కు బలమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు నుంచి పోటీచేయనున్నారని ఒక కథనం ప్రచారంలో ఉంది . ఇందులో నిజానిజాలు ఎలా ఉన్న అందుకు అవకాశాలు తోసి పుచ్చలేమని రాజకీయపండితుల అభిప్రాయం . గతంలో సిద్ధిపేట నుంచి పోటీ చేసిన కేసీఆర్ తరువాత ఆనియోజవర్గాన్ని మేనల్లుడు హరీష్ రావు కు వదిలి గజ్వేల్ కు వెళ్లారు . అక్కడ గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవి భాద్యతలు స్వీకరించారు . రెండు పర్యాయాలు సీఎం గా ఆయన పాలనా సాగుతుంది. ఇప్పుడు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే దానిప్రభావం ఆ జిల్లాపై ఉంది పార్టీకి ప్రయోజనం జరుగుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సూచనమేరకు నియోజకవర్గ మార్పుకు మొగ్గుచూపుతున్నారని టీఆర్ యస్ వర్గాల బోగట్టా .

నల్లగొండ లో ఇప్పటికి కాంగ్రెస్ బలంగా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ లోని నల్గొండ , భవనగిరి పార్లమెంట్ నియోజవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ కు ఇప్పటికి ఈ జిల్లాలో బలమైన నాయకత్వం ఉంది. కోమటి రెడ్డి బ్రదర్స్ , సీనియర్ నేత జానారెడ్డి , మాజీ పీసీసీ చీఫ్ ,నల్గొండ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి, అద్దంకి దయాకర్ లు ఈ జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు. ఇప్పటికే ఒకటి రెండు సర్వే లు నిర్వహించిన టీఆర్ యస్ కు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు తేలిందని సమాచారం . అందువల్ల ఇప్పటినుంచే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు .

ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు , ప్రజల్లో వారిపట్ల ఉన్న సానుకూలత ఆధారంగా తిరిగి వారిని ఎంపిక చేయటమా ? లేదా అనేది నిర్ణయించనున్నారు . ఎంతటి పెద్దవారైనా గెలవగలిగే వారికే టికెట్స్ అనే సూత్రాన్ని కచ్చితంగా పాటించాలని నిర్ణయించారు . కేసీఆర్ నియోజకవర్గ మార్పు తమకు కలిసి వస్తుందని టీఆర్ యస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మైక్రో లెవల్ లో పరిశీలన జరుగుతుందని అంటున్నారు .

Related posts

రూ. 5,500 కోట్లు ఖర్చు పెట్టి 277 మంది ఎమ్మెల్యేలను కొన్నారు: బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్!

Drukpadam

ఏపీలో కొత్త జిల్లాల‌కు కేబినెట్ ఆమోదం…

Drukpadam

బెంగళూరుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌!

Drukpadam

Leave a Comment