క్రైమ్ వార్తలు

మిస్టరీగా మారిన చైనా విమాన ప్రమాద ఘటన!

మిస్టరీగా మారిన చైనా విమాన ప్రమాద ఘటన!

  • సోమవారం కూలిపోయిన చైనా విమానం
  • విమానంలో 132 మంది
  • పర్వత ప్రాంతంలో కూలి దగ్ధమైపోయిన విమానం
  • ఇప్పటివరకు ఒక్క మృతదేహం కూడా లభ్యంకాని వైనం

చైనాలో ఇటీవల 132 మందితో వెళుతున్న బోయింగ్ విమానం ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాద ఘటన ఓ మిస్టరీగా మారింది. ఇప్పటివరకు ఆ విమానంలోని వారి ఆచూకీ తెలియరాలేదు. వారి మృతదేహాలు కూడా లభ్యం కాలేదు.

విమాన ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), ఫ్లయిట్ డేటా రికార్డర్ (ఎఫ్ డీఆర్) ఎంతో కీలకం. ఈ బ్లాక్ బాక్స్ లను విశ్లేషిస్తే విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ను కనుగొన్న సహాయక బృందాలు, తాజాగా ఫ్లయిట్ డేటా రికార్డర్ ను కూడా స్వాధీనం చేసుకున్నాయి.

కాగా, ఈ విమానం గాల్లోనే అధిక పీడనంతో పేలిపోయి నేలకూలి ఉంటుందని భావిస్తున్నారు. విమానం కూలిపోయిన ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలో ఓ శకలాన్ని గుర్తించారు. ఆశ్చర్యకరంగా మృతదేహాలేవీ లభ్యం కాలేదు. దాంతో ఈ విమాన ప్రమాద మృతులపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే విమానం కూలిపోయి, దగ్ధమైన తీరు చూస్తుంటే ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండే అవకాశాల్లేవని తెలుస్తోంది.

Related posts

గోవాలో జానీ మాస్టర్ అరెస్టు!

Ram Narayana

అమెరికాలోని పనామాలో బస్సు బోల్తా.. 39 మంది దుర్మరణం!

Drukpadam

మంటగలుస్తున్న మానవ సంబంధాలు… బీమా డబ్బు కోసం మామ హత్య!

Ram Narayana