Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీది అచ్ఛేదిన్ కాదు చచ్చేదిన్:సీఎల్పీ నేత భట్టి!

బండి సంజయ్ మీ పాదయాత్ర ఎవరికోసం?

మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై పాదయాత్ర చేయండి

జాతిని విడగొట్టడానికి అడుగులు వేయోద్దు

ఫెడరల్ స్ఫూర్తికి ద్రోహం చేస్తున్న బిజెపి పాదయాత్ర చేయడం విడ్డూరం

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మోడీ సర్కార్ వైఫల్యాలను తూర్పారబట్టిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రాణం

కల్వర్టు నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ

పాదయాత్రకు తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ సంఘీభావం

దేశంలో ఉన్న అన్ని మతాలు, కులాలకు సమానత్వం కల్పించి జాతి నిర్మాణం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున మనువాదం పేరిట జాతిని విడగొట్టాలని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఫెడరల్ స్ఫూర్తికి ద్రోహం చేసే విధంగా, దళిత, గిరిజన బలహీన వర్గాలను మరింత వెనుక బడేటట్లుగా చేసి, మనువాదాన్ని ముందుకు తీసుకుపోవాలని బండి సంజయ్ చేపట్టిన సంగ్రామ యాత్ర పట్ల లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు, అప్రమత్తంగా ఉండాలన్నారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర దేశంలో లౌకిక వాదం లేకుండా చేయడానికి, భావ స్వేచ్ఛను హరించడానికి, ఫెడరల్ స్ఫూర్తిని విఘాతం కలిగించడానికి చేస్తున్న యాత్రగా ఉందని విమర్శించారు. అచ్చే దిన్ తీసుకువస్తానని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దేశ ప్రజలకు సచ్చే దిన్ తీసుకువచ్చాడని బండి సంజయ్ పాదయాత్ర చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. సామాన్యులపై మోడీ సర్కార్ అనేక భారాలను మోపుతూ.. సంపన్నులకు మాత్రం 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మొండి బకాయిలుగా చూపిస్తూ మాఫీ చేసిన విషయాన్ని పాదయాత్రలో బండి సంజయ్ ప్రజలకు వివరిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సంగ్రామ యాత్ర రణ నినాదం చేస్తుందా అని నిలదీశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకుండా, కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడానికి పరోక్షంగా ప్రధాని మోడీ సహకరిస్తున్న నిజాలను పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ప్రజలకు చెబితే ఆయన పాదయాత్రకు అర్థం ఉంటుందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా అమలు చేయకుండా దేశ ప్రజలను ప్రధాని మోడీ మోసం చేశారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట అంబానీ ఆధానీలకు దారాదత్తం చేస్తూ.. ఉన్న ఉద్యోగుల ఉపాధిని మోడీ సర్కార్ దెబ్బతీస్తుందని దుయ్యబట్టారు. ఇలా కేంద్రం అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలపై సంగ్రామం చేయకుండా, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి , విభజించి పాలించు విధానంతో రాజ్యాధికారం లోకి రావాలని తహ తహ లాడుతూ పాదయాత్ర చేస్తే ప్రజలకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రాణం

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా॥ బి.ఆర్. అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా గురువారం బోనకల్ మండలం కలకోట గ్రామంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందని వివరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ స్వేచ్ఛ, బ్రతికే హక్కు, లౌకికవాదం అమలు చేయడమే అంబేద్కర్ కి అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.

పాదయాత్రకు తెలుగుదేశం, సిపిఎం ,సిపిఐ సంఘీభావం


ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు గురువారం బోనకల్లు మండలం రాయన్నపేటలో తెలుగుదేశం సిపిఎం, సిపిఐ నాయకులు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. 

Related posts

బీజేపీకి షాక్ …. నలుగురు కార్పొరేటర్లు టీఆర్ యస్ లో చేరిక !

Drukpadam

శశిథరూర్ తో నన్ను పోల్చొద్దంటున్న మల్లికార్జున్ ఖర్గే!

Drukpadam

సిపిఐ కొత్తగూడం గర్జన సభ గ్రాండ్ సక్సెస్ …జోష్ లో సిపిఐ…

Drukpadam

Leave a Comment