Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేటీఆర్ 16 ఖమ్మం పర్యటన 18 కి మార్పు: మంత్రి అజయ్


ఖమ్మం కేటీఆర్ ఈ నెల 16 బదులు 18 రాక: మంత్రి పువ్వాడ అజయ్
-పనివత్తిడి వల్లనే పర్యటనలో మార్పు
-అభివృద్ధి కార్యక్రమాలు యధావిధిగా ఉంటాయి.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈ నెల 18న ఖమ్మం పర్యటనకు రానున్నారు. గతంలో అనేకసార్లు ఖరారైన ఈ పర్యటన తరువాత వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ నెల 18న మంత్రి కేటీఆర్‌ పర్యటన ఖరారైనట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

★ పర్యటన వివరాలు

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్‌ ఈ నెల 18న ఉదయం 9 హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా బయలుదేరి 10 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 10:15కు రఘునాథపాలెం బృహత్‌ పల్లె ప్రకృతి వనం (సుడా) పారును ప్రారంభిస్తారు. 10:45కు ఖమ్మం టేకులపల్లి కేసీఆర్‌ టవర్స్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయంలో 240 ఇళ్లను ప్రారంభిస్తారు. 11:15కు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్‌పాత్‌ను ప్రారంభిస్తారు. 11:45కు గట్టయ్య సెంటర్‌లోని నూతన మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. చెత్త సేకరణ కోసం మంజూరైన 10 ట్రాక్టర్లు, 15 ఆటోలను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం తీసుకుంటారు. 2:30కు దానవాయిగూడెంలో ఎఫ్‌ఎస్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. 3 గంటలకు ప్రకాశ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత 3:30కు శ్రీనివాసనగర్‌లో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరిగా సాయంత్రం 4 గంటలకు లకారం ట్యాంక్‌బండ్‌లో సస్పెన్షన్‌ బ్రిడ్జి, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌లను ప్రారంభిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.

ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

Related posts

వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్… బృందం చీఫ్ గా సీవీ ఆనంద్!

Drukpadam

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య- 2,99,92,941

Drukpadam

Leave a Comment