Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ పై ఈడీ విచారణ …కేంద్రానిది దుర్మార్గ వైఖరి అని శివసేన మండిపాటు …

రాహుల్ పై ఈడీ విచారణ …కేంద్రానిది దుర్మార్గ వైఖరి అని శివసేన మండిపాటు …
-కేంద్రం నెహ్రూ, ఇందిర వారసుల భవిష్యత్తును కూడా కాలరాసే ప్రయత్నం చేస్తోంది
-కేంద్రానిది అధికార దురంహకారమని మండిపాటు
-పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం
-గ్యాస్ చాంబర్లు నిర్మించడమొక్కటే తక్కువ అంటూ ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారిస్తుండడం పట్ల శివసేన పార్టీ నిప్పులు చెరిగింది. పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దివంగత కాంగ్రెస్ నేతలు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల స్మృతులను చెరిపివేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం… నెహ్రూ, ఇందిరల వారసుల భవిష్యత్తును కూడా కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని శివసేన ఆరోపించింది.

రాహుల్ గాంధీపై విచారణ ద్వారా, తాను ఎవరి కాలర్ అయినా పట్టుకోగలనని కేంద్రం భావిస్తోందని పేర్కొంది. “ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ… రేపు ఇంకెవరైనా కావొచ్చు! నాడు హిట్లర్ తన శత్రువులను అంతమొందించేందుకు గ్యాస్ చాంబర్లు నిర్మించాడు. ఇప్పుడీ కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే గ్యాస్ చాంబర్లు నిర్మించడం ఒక్కటే తక్కువ. ఇది చట్టం యొక్క సమానత్వం అనిపించుకుంటుందా?” అంటూ విమర్శనాస్త్రాలు సంధించింది. కేంద్రానిది అధికార దురంహకారం అని పేర్కొంది. ఇప్పటికే దీనిపై దేశవ్యాపిత నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.అనేక పార్టీలు ,మేధావులు కేంద్రం వైఖరిని తప్పుపడుతున్నారు .

Related posts

ఏపీ సీఎం జగన్ కు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఫోన్ !

Drukpadam

సీఎం కేసీఆర్​ పెట్టిన మునుగోడు ‘మెజారిటీ’ పరీక్షలో మంత్రుల ప్రోగ్రెస్​ రిపోర్టు!

Drukpadam

ఓపిక నశించింది.. అణుబాంబు వేసే సమయం వచ్చింది…పుతిన్‌

Drukpadam

Leave a Comment