ఏపీ సీఎం జగన్ పారిస్ టూర్ ఖరారు… రేపు సాయంత్రం ఫ్లైటెక్కనున్న జగన్!
-కూతురు చదివే కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కానున్న జగన్‌జగన్ పారిస్ -టూర్‌కు అనుమతిచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు
-జులై 3న తిరిగి రానున్న జగన్
జగన్ ఫారెన్ టూర్ కు సిబిఐ నో చెప్పినప్పటికీ కోర్ట్ అంగీకరించడంతో రేపు ఆయన బయలుదేరనున్నారు . జగన్ పెద్ద కూతురు పారిస్ లో చదువుతున్న సంగతి తెలిసిందే … ఆమె కాన్వకేషన్ కోసం జరిగే కార్యక్రమంలో తల్లిదండ్రలు పాల్గొనే ఆవకాశం పాశ్చత్య దేశాలు కల్పిస్తాయి. అందులో భాగంగానే ఆయన తన గారాలపట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తీ చేసిన సందర్భంగా భార్య భారతి తో కలిసి పాల్గొంటారు .
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ ఇటీవలే పిటిషన్ దాఖలు చేయగా… నాంపల్లిలోని సీబీఐ కోర్టు అందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో పర్యటించేందుకు జగన్‌కు కోర్టు అనుమతించింది.
తన కుమార్తె విద్యనభ్యసిస్తున్న కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు జగన్ పారిస్ వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం రేపు (మంగళవారం) రాత్రి 7.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న జగన్ పారిస్‌లో వచ్చే నెల 2వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఆ తర్వాత జులై 3న ఆయన తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.