Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు!

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు!
-2018లో ధర్మపురి నుంచి పోటీచేసిన ఈశ్వర్
-కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన అడ్లూరి లక్ష్మణ్
-వీవీ ప్యాట్లు లెక్కించలేదన్న లక్ష్మణ్
-ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
-కౌంటర్ దాఖలు చేసిన మంత్రి ఈశ్వర్
-ఈశ్వర్ పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ చేసుకున్న విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నేడు తోసిపుచ్చింది.

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2018 కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలుపొందడం పై ఆయన ప్రత్యర్థి గా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరిగా లేదని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులు ఎన్నికల సంఘం పట్టించుకోకుండా నీ ఈశ్వర్ ఎన్నికైనట్లు ప్రకటించింది. దీనిపై దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు జోక్యం చేసుకుని కొప్పుల ఈశ్వర్ పిటిషన్ను తిరస్కరిస్తూ లక్ష్మణ్ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

అసలేం జరిగిందంటే… కొప్పుల ఈశ్వర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ పోటీ చేశారు. ఇందులో కొప్పుల ఈశ్వర్ విజేతగా నిలిచారు.

అయితే, ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్టు ప్రకటించారని అడ్లూరి లక్ష్మణ్ కోర్టుకెక్కారు. ఇది ప్రజాస్వామ్య ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని, ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై కౌంటర్ దాఖలు చేసిన కొప్పుల ఈశ్వర్… తన ఎన్నిక చెల్లదని చెప్పేందుకు అడ్లూరి లక్ష్మణ్ తగిన కారణాలు చూపలేదని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఈ వాదనలు పట్టించుకోలేదు. కొప్పుల ఈశ్వర్ కౌంటర్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. త్వరలోనే అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

Related posts

కరోనా తో 35 లక్షల మంది మరణం ….

Drukpadam

జగన్ కష్టాలను దేవుడే చూసుకుంటాడు: మేనత్త విమలమ్మ

Ram Narayana

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తెలంగాణ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్…

Drukpadam

Leave a Comment