ఫ్లాష్ …ఫ్లాష్ …
సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం!
-మహా రాజకీయాల్లో మరో ట్విస్ట్
-ఇద్దరితో ప్రమాణం చేయించిన గవర్నర్
-రాజ్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం
బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగంగా జరిగిన మహారాష్ట్ర సంక్షోభానికి నేటితో తెరపడింది. శివసేన చీలికవర్గం నేత ఎకనాథ్ షిండే ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయగా , గతంలో బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం …అందులో 106 మంది సభ్యులు బీజేపీకి ఉండగా ఎకనాథ్ షిండే కు 50 మంది బలం మాత్రమే ఉంది. బీజేపీ తో ఒప్పందంలో భాగంగా ఎకనాథ్ కు సీఎం సీటు ఇచ్చిన బీజేపీ డిప్యూటీ గా మాజీ సీఎం ఫడ్నవిస్ అంగీకరించడం గమనార్హం … ఇప్పుడు రాజకీయాల్లో ఇదో ఆసక్తి కరమైన చర్చగా మారింది.
గత కొన్ని రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి గురువారం రాత్రితో తెర పడిపోయింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. శివసేన తిరుగుబాటు వర్గానికి మద్దతు ప్రకటించిన విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ రాజ్ భవన్‌లో వీరితో ప్రమాణం చేయించారు.
రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ ,శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు . మంత్రి వర్గాన్ని విస్తరించాల్సి ఉంది. …
