Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎలాంటి కేబుళ్లు లేకుండా…ఇండియాలో అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్..

ఇండియాలో అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్.. ఎలాంటి కేబుళ్లు లేకుండా నేరుగా ఇళ్లకు ఇంటర్నెట్

  • డీటీహెచ్ తరహాలో ఇళ్లకు ఇంటర్నెట్ అందే అవకాశం
  • అడవులు, మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి
  • భారత్ లో తమ ప్రాజెక్టుకు లైసెన్స్ ప్రక్రియను డీల్ చేయగల వ్యక్తి కోసం అమెజాన్ వెతుకులాట
  • దేశ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించేవారు కావాలని ప్రకటన

ప్రపంచ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్.. మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎలాంటి కేబుళ్ల జంఝాటం లేకుండా డీటీహెచ్ తరహాలో నేరుగా ఇళ్లకు వైర్ లెస్ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అమెజాన్ సంస్థ గతంలోనే.. ‘అమెజాన్ ప్రాజెక్ట్ క్యూపర్’ను ప్రారంభించింది. పది బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80 వేల కోట్లు) వ్యయంతో మొత్తంగా 3,236 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు 2020లోనే ఈ ప్రాజెక్టును చేపట్టింది.

  • అడవులు, మారుమూల ప్రాంతాలు, ఎటువంటి సదుపాయాలు లేని చోట్ల కూడా నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ను అందుకోగలగడం దీని ప్రత్యేకత.
  • భూమిపై తక్కువ ఎత్తులోని కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్)లో అమెజాన్ ఉపగ్రహాలు తిరుగుతూ ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి.
  • ఈ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అమెజాన్ ఇప్పటికే ఏరియాన్ స్పేస్, బ్లూ ఆరిజిన్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ తదితర స్పేస్ కంపెనీలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది.

ప్రాజెక్టును చూసుకునేవారు కావాలంటూ..
‘‘భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విస్తరణ కోసం లైసెన్సుల ప్రక్రియ, ఇతర అంశాలను చూసుకోగల సామర్థ్యమున్న వ్యక్తి అవసరం. అమెజాన్ బిజినెస్ డెవలప్ మెంట్ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లగలగాలి. వినూత్న ఆలోచనలతో వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు చర్యలు తీసుకోగలగాలి. భారత దేశంలో వ్యాపార విస్తరణకు ఏం చేయాలన్న అవగాహన కలిగి ఉండాలి..” అని అమెజాన్ ఇండియా విభాగం తాజాగా ప్రకటించింది.

  • ఇండియాలో లైసెన్సింగ్, ఇతర ప్రక్రియలు పూర్తయితే త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెజాన్ వర్గాలు తెలిపాయి.
  •  Amazon satellite internet in India

Related posts

ఎంపీ సంతోష్ పై వార్త కథనాలు ….ఖండించిన ఎంపీ…

Drukpadam

రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కాళ్లు కోల్పోయిన ఖమ్మం యువకుడు…

Drukpadam

Jennifer Lopez Nailed the Metallic Shoe Trend Again on a Date

Drukpadam

Leave a Comment