Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించే ప్ర‌తిపాద‌న ఉంది: కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు

అమ‌రావ‌తి నుంచి క‌ర్నూలుకు హైకోర్టును త‌ర‌లించే ప్ర‌తిపాద‌న ఉంది: కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు

  • వైసీపీ ఎంపీల ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన రిజిజు
  • ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చొర‌వ తీసుకోవాల‌న్న కేంద్ర మంత్రి
  • హైకోర్టుతో చ‌ర్చించి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించాలని వెల్ల‌డి
ఏపీలో లో మూడు మూడు రాజధానులు అంశం తిరిగి ప్రస్తావనకు వచ్చింది. నేడు పార్లమెంట్లో జరిగిన ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ రాజధానిగా కర్నూల ఎంపిక చేసిందని హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు తరలించే ప్రతిపాదన ఏదైనా ఉందా అని వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు సమాధానమిస్తూ అమరావతి నుంచి కర్నూలు న్యాయ రాజధాని తరలించే ప్రతిపాదన ఉందని స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన లోక్ సభలో పేర్కొన్నారు. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతోందని కూడా తెలియజేశారు. ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబందించిన అంశమని కూడా తెలిపారు .ఇప్పటికే అనేక సందర్భాల్లో న్యాయరాజధానిగా కర్నూల్ ఉంటుందని ఇది తమ విధానమని ప్రభుత్వం చెప్పింది. అమరావతిలోని అన్ని రాజధానులు ఉండాలని అమరావతి జేఏసీ పేరుతొ ఉద్యమాలు జరిగాయి. హైకోర్టు లో రాజధానుల అంశం పై వాదప్రతివాదనలు జరిగాయి. అయితే కేంద్రం సైతం రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిది హైకోర్టు కు అఫిడివిట్ కూడా ఇచ్చింది.

ప్ర‌స్తుతం అమ‌రావ‌తి కేంద్రంగా కొన‌సాగుతున్న హైకోర్టును రాయ‌ల‌సీమ ప్రాంతంలోని క‌ర్నూలుకు త‌ర‌లించే ప్ర‌తిపాద‌న ఉంద‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు పార్ల‌మెంటులో ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు వైసీపీ ఎంపీలు సంధించిన ఓ ప్ర‌శ్న‌కు సమాధానంగా నేడు లోక్ స‌భ‌లో మంత్రి ఈ ప్ర‌క‌ట‌న చేశారు.

అయితే హైకోర్టు త‌ర‌లింపు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చొరవ తీసుకోవాల‌ని రిజిజు త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. హైకోర్టుతో చ‌ర్చించి రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌డుగు వేయాల్సి ఉంద‌ని ఆయ‌న తెలిపారు. హైకోర్టు, రాష్ట్ర ప్ర‌భుత్వం క‌లిసి ఓ నిర్ణ‌యానికి రావాల్సి ఉంద‌న్న రిజిజు… ఆ త‌ర్వాత ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్రానికి పంపాల‌ని సూచించారు.

union minister kiren rijiju statement on ap hifh court relocate from amaravati to kurnool

Related posts

ఏపీ సీఎం జగన్ కు చిరంజీవి సుతిమెత్తని హెచ్చరిక …కష్టాల్లో ఉన్న పరిశ్రమని ఆదుకోవాలని విజ్ఞప్తి!

Drukpadam

పోతిరెడ్డిపాడు లిఫ్ట్ పై చంద్రబాబు వైఖరేంటో స్పష్టం చేయాలి: సజ్జల…

Drukpadam

పవన్ కల్యాణ్ ఇంటివద్ద రెక్కీ చేస్తారా… బతకనివ్వరా?: చంద్రబాబు

Drukpadam

Leave a Comment